వికారాబాద్ జిల్లా పరిగిలో చోటు చేసుకున్న ఘటన మాయని మచ్చగా నిలిచింది. పేషంట్ తో ఉన్న ప్రభుత్వ అంబులెన్స్ కు దారి దొరకని పరిస్థితి ఆ ప్రాంతంలో ఏర్పడింది. తెలంగాణా ప్రభుత్వం ఇటీవల నూతన రెవెన్యూ చట్టం తెచ్చిన సంగతి తెలిసిందే. నూతన రెవిన్యూ చట్టం తీసుకొచ్చిన కెసీఆర్ కు కృతజ్ఞత తెలుపుతూ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఎమ్మెల్యే మహేష్ రెడ్డి ఆద్వర్యంలో వందల సంఖ్యలో ట్రాక్టర్లతో ర్యాలీ చేపట్టారు.
ఆ సమయంలో నిండు గర్భం తో ఉన్న ఓ మహిళను 108 లో పరిగి నుండి తాండూరు జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఈ క్రమంలో అంబులెన్స్ ర్యాలీలో చిక్కుకు పోవడంతో ఆమె నొప్పులకు అల్లాడిపోయింది. అక్కడ ఉన్న ఏ ఒక్కరు కూడా అంబులెన్స్ కి దారి ఇవ్వలేదు. 20 నిమిషాల పాటు ఇబ్బందులు పడింది. ర్యాలీకి అడ్డంగా ఉన్న గేదెలను తోలిన పోలీసులు అంబులెన్స్ కి అడ్డంగా ఉన్న ట్రాక్టర్ ని తోలలేదు.