విజయవాడ: రాష్ట్రంలో కాంగ్రెస్‌కు నిశ్శబ్ద విప్లవం కనిపిస్తుందని ఆ పార్టీనేత తులసిరెడ్డి అన్నారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ ప్రజలు బీజేపీని శని గ్రహంగా..టీడీపీ, వైసీపీని రాహువు, కేతువుగా చూస్తున్నారని తెలిపారు. జనసేన కాదు..ధన సేన అని విమర్శించారు. సినిమా తరహాలో హెలికాప్టర్ ద్వారా జనసేన కవాతుపై పూలవర్షం కురిపించేందుకు ఏర్పాట్లు చేశారని, పేదలపార్టీకి ఈ హంగామాలకు డబ్బులెక్కడివని ప్రశ్నించారు. శ్రీకాకుళం ప్రజలు ఇబ్బందులు పడుతుంటే పవన్‌కళ్యాణ్ హెలికాప్టర్ నుంచి పూలు చల్లించుకుంటున్నారని మండిపడ్డారు. పేదల పార్టీకి డబ్బులెక్కడివని తులసిరెడ్డి నిలదీశారు.
పవన్‌కు అన్ని డబ్బులు ఎక్కడివో చెప్పాలి? తులసీ రెడ్డి
-