హుజూరాబాద్‌ పోరులో అదిరిపోయే ట్విస్ట్…ఈటల రాజేందర్ భయం అదేనా?

-

తెలంగాణ రాజకీయాలు బాగా హాట్ హాట్‌గా సాగుతున్నాయి. ఇప్పటికే ఈటల రాజేందర్ etela rajender టీఆర్ఎస్ నుంచి బయటకు రావడం, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి హుజూరాబాద్ బరిలో మళ్ళీ నిలబడటంతో రాజకీయాలు వేడెక్కాయి. అయితే తెలంగాణ కాంగ్రెస్ పగ్గాలు రేవంత్‌కు దక్కడంతో పరిస్తితి ఒక్కసారిగా మారింది. తెలంగాణ రాజకీయాల్లో కాంగ్రెస్ కూడా రేసులోకి వచ్చింది.

ఈటల రాజేందర్/ etela rajender

ఇదే క్రమంలో హుజూరాబాద్ ఉపఎన్నికలో అదిరిపోయే ట్విస్ట్ ఉండొచ్చని తెలుస్తోంది. ప్రస్తుతం బీజేపీ నుంచి ఈటల రాజేందర్ పోటీ చేయనున్నారు. అటు టీఆర్ఎస్ నుంచి ఇంకా అభ్యర్ధి ఖరారు కాలేదు. కానీ టీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు ఇప్పటికే హుజూరాబాద్ బరిలో కారుని గెలిపించాలని తిరుగుతున్నారు. ఇక బీజేపీ నేతలు సైతం హుజూరాబాద్‌లో ప్రచారం హోరెత్తిస్తున్నారు.

అయితే మొన్నటివరకు హుజూరాబాద్ బరిలో కాంగ్రెస్ పెద్దగా పోటీ ఇవ్వలేదని అంతా అనుకున్నారు. కానీ రేవంత్‌కు పీసీసీ దక్కడంతో ఒక్కసారిగా సమీకరణాలు మారాయి. ప్రస్తుతం హుజూరాబాద్ బరిలో కాంగ్రెస్ తరుపున తానే నిలబడతానని కౌశిక్ రెడ్డి ప్రచారం చేస్తున్నారు. కానీ కౌశిక్ టీఆర్ఎస్‌కు అనుకూలంగా పనిచేస్తున్నారని ప్రచారం జరుగుతుంది. ఈ క్రమంలోనే కాంగ్రెస్ అభ్యర్ధిని మార్చవచ్చని తెలుస్తోంది.

ఇక కాంగ్రెస్ అభ్యర్ధిని మారిస్తే ఈటల గెలుపుపై ప్రభావం పడే అవకాశాలు లేకపోలేదని తెలుస్తోంది. ఎందుకంటే కౌశిక్ టీఆర్ఎస్‌కు అనుకూలంగా ఉన్నారని రావడంతో టీఆర్ఎస్ వ్యతిరేక ఓటింగ్‌లో పెద్ద చీలిక వచ్చేది కాదని విశ్లేషకులు భావిస్తున్నారు. అప్పుడు ఈటలకు లబ్ది చేకూరేదని, కానీ ఇప్పుడు అభ్యర్ధిని మారిస్తే టీఆర్ఎస్ వ్యతిరేక ఓట్లు భారీగా చీలే అవకాశం ఉంటుందని, అప్పుడు ఈటలకు డ్యామేజ్ జరిగే ఛాన్స్ ఉందని ప్రచారం జరుగుతుంది.

అంటే టీఆర్ఎస్ వ్యతిరేక ఓట్లు కాంగ్రెస్-బీజేపీలు పంచుకుంటాయి. కాంగ్రెస్ ఎంత ఎక్కువగా ఓట్లు తెచ్చుకుంటే, అంత ఎక్కువగా ఈటలకు ఇబ్బంది అవుతుందని తెలుస్తోంది. చూడాలి మరి హుజూరాబాద్ పోరులో కాంగ్రెస్ ఎలాంటి ట్విస్ట్‌లు ఇస్తుందో?

Read more RELATED
Recommended to you

Exit mobile version