ట్విట‌ర్ పోల్ : ఏపీలో అప్ర‌క‌టిత కోత‌లు స‌ర్కారు వైఫ‌ల్య‌మా ?

-

మాట్లాడండి..న‌చ్చినంత మాట్లాడండి..మాట్లాడండి కొట్లాడండి కూడా! ఏం చేసినా కూడా మీకు అంతా మంచే జ‌రుగుతుంది. ఇప్పుడు వెన్నెల వేళ‌లు కావు క‌నుక ఆరు బ‌య‌ట క‌టిక చీక‌టి ప‌రుచుకుని ఉంటుంది క‌నుక ఇప్పుడు మాట్లాడ‌కుంటే ఎప్పుడూ మాట్లాడ‌లేరు. ఎప్పుడూ మీరు అనుకున్న‌ది సాధించ‌లేరు.

ఆ విధంగా మీ ప్ర‌యాణం మున్ముందుకు సాగించ‌లేరు. అందుకే చీక‌టి వేళ‌లు మంచివి.. వెన్నెల వేళ‌లు ఇంకా మంచివి.. మేలు చేసేవి కూడా !వాస్త‌వానికి ఇవ‌న్నీ మాట్లాడుకునేందుకు రాసుకునేందుకు బాగానే ఉంటాయి కానీ తాజాగా జ‌రుగుతున్న ప‌రిణామాలు ఇందుకు భిన్నంగా ఉన్నాయి. రాష్ట్రంలో అప్ర‌క‌టిత కోత‌ల‌కు అంతూపొంతూ లేకుండా ఉంది. విద్యుత్ వినియోగానికీ స‌ర‌ఫ‌రా కు మ‌ధ్య ఉన్న గ్యాప్ కార‌ణంగానే ఈ స‌మ‌స్య త‌లెత్తుంతోంద‌ని ప్ర‌భుత్వం మొత్తుకుంటోంది.

కానీ వాస్త‌వాలు ఇంకొన్ని విభిన్నంగానే ఉన్నాయి. ఛార్జీలు పెంచాక నాణ్య‌మ‌యిన విద్యుత్ ను స‌ర‌ఫ‌రా చేయాల్సిన బాధ్య‌త‌ను మ‌రిచి కేవ‌లం వినియోగం పేరిట కోత‌లు అంటూ చెప్ప‌డం అస్స‌లు ఒప్పుకోలుకు అంగీకారానికి తూగ‌ని విష‌యం. అందుకే స‌మ‌స్య ఒకంత‌ట ప‌రిష్కారం కావ‌డం లేదు. లోటు గ‌త నెల 30 తేదీన 20.05 మిలియ‌న్ యూనిట్లు ఉండ‌గా, ఇప్పుడు 14.15 మిలియ‌న్ యూనిట్లుగా ఉంది అని ప్ర‌ధాన మీడియా చెబుతోంది.

మ‌రోవైపు కొన్ని విద్యుత్ ఉత్ప‌త్తి కేంద్రాలు త‌మ సామ‌ర్థ్యంలో సగం కూడా ఉత్ప‌త్తి ఇవ్వ‌లేక‌పోతున్నాయి. వివిధ కార‌ణాల రీత్యా ప‌నిచేయలేకపోతున్నాయి. దీంతో కోత‌లు అన్న‌వి త‌ప్పని స‌రి అవుతున్నాయి. కృష్ణప‌ట్నం విద్యుత్ ఉత్ప‌త్తి కేంద్రం నుంచి 1600 మెగా యూనిట్లు ఉత్ప‌త్తి కావాల్సి ఉన్నా ప్ర‌స్తుతం 876 యూనిట్లు ఉత్ప‌త్తి అవుతోంది..అదేవిధంగా మిగ‌తా కేంద్రాలు కూడా ప‌నిచేస్తున్నాయి అని ప్ర‌ధాన మీడియా అందిస్తున్న వివ‌రం. ఎలా చూసుకున్నా సాంకేతిక కార‌ణాల సాకుతో కోత‌లు త‌ప్ప‌వు అని చెప్ప‌డం భావ్యం కాదు అన్న వాద‌న ఒక‌టి బ‌లీయంగా వినిపిస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version