మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దావ్ థాకరే ముఖ్యమంత్రి పదవి ఉంటుందా లేదా అనే దాని మీద ఎన్నో వార్తలు వచ్చాయి. ఆయన ముఖ్యమంత్రి పదవి ఊడిపోతుంది అంటూ మరాఠా మీడియా కథనాలు ప్రసారం చేసింది. బిజెపి అనుకూల మీడియా కూడా దీనిపై ఎక్కువగా కథనాలు రాసింది. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చెయ్యాలి అంటే కచ్చితంగా చట్ట సభలో ఎన్నిక కావాల్సి ఉంటు౦ది. కాని ఆయన ఏ సభకు ఎంపిక కాలేదు.
ముఖ్యమంత్రిగా ఎంపిక అయిన తర్వాత అయినా సరే ఆయన చట్ట సభకు వెళ్ళాలి. కాని గత నెలలో జరగాల్సిన ఎమ్మెల్సీ ఎన్నికలు కరోనా కారణంగా వాయిదా పడ్డాయి. ఆయన మే 27 లోపు ఎన్నిక కావాలి. దీనితో కేబినేట్ ఆయన్ను గవర్నర్ కోటా నుంచి ఎమ్మెల్సీ చెయ్యాలని సూచించింది. కాని కోష్యారి ముందుకి అడుగు వేయలేదు. దీనితో ఆయన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చెయ్యాల్సి ఉందని అనుకున్నారు.
ఈ నేపధ్యంలో మహారాష్ట్ర లెజిస్లేటివ్ కౌన్సిల్లో ఖాళీ అయిన 9 సీట్లకు ఎన్నికలు నిర్వహించాలని ఆ రాష్ట్ర గవర్నర్ కోష్యారి కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాయగా మే 27, 2020 లోపు ఉద్ధవ్ కౌన్సిల్‌కు ఎన్నిక కావాల్సి ఉందని గవర్నర్ ఈసీకి వివరించారు. లేఖపై స్పందించిన కేంద్ర ఎన్నికల సంఘం మహారాష్ట్రలో ఎమ్మెల్సీ ఎన్నికలు నిర్వహించడానికి రెడీ అయ్యారు.