సీఎం జగన్ ఈ మధ్య కంగారు పడుతున్నారే.. వర్ల రామయ్య వ్యాఖ్య‌లు..!

-

నేడు మీడియాతో మాట్లాడిన టీడీపీ నేత వర్ల రామయ్య సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిపై విమ‌ర్శ‌లు గుప్పించాడు. సీఎం జగన్ ఈ మధ్య కంగారు పడుతున్నారని.. ఇందుకు కార‌ణం ఆయనపై నమోదైన 11 కేసుల్లో విచారణ ముంచుకు రావడమేనని అన్నారు. అలాగే గత మే నుంచి జనవరి 25వరకు జరిగిన ట్రయల్స్ లో జనవరి 10న మాత్రమే కోర్టుకు హాజరయ్యారన్నారు. ఇప్పటివరకు కోర్టు హాజరు నుంచి తప్పించుకున్న జగన్ ఇక తప్పించుకోలేరని పేర్కొన్నారు. తాజాగా కోర్టులో హాజరు కావాలని కోర్టు పేర్కొనటం పట్ల వర్ల హర్షం వ్యక్తం చేశారు. 2012లో జగన్ పై సీబీఐ 11 చార్జీషీట్లు నమోదు చేయగా, అనంతరం ఈడీ 5 చార్జీషీట్లు వేశారని వర్ల వెల్లడించారు.

2014 మార్చి 10న సుప్రీంకోర్టు ఆదేశాలు వెలువరిస్తూ.. ఎంపీలు, ఎమ్మెల్యేలపై కేసుల విచారణను సంవత్సరంలో పూర్తి చేయాలని పేర్కొన్న విషయాన్ని వర్ల ఈ సందర్భంగా ఉటంకించారు. మిగతా కేసుల్లో ఈ ఆదేశాలు అమలవుతున్నాయి. కానీ జగన్ పై కేసులు ఇన్నేళ్లుగా ఎందుకు సాగుతున్నాయో తెలియటం లేదన్నారు. సీబీఐ కోర్టుపై తమకు గౌరవముందంటూ.. జగన్ పై కేసుల విచారణలో ఆలస్యం జరగటంపై ప్రశ్నించారు.

Read more RELATED
Recommended to you

Latest news