ఓటరు జోరు..తగ్గని పార్టీల హోరు..!

-

మునుగోడులో నిన్నటివరకు రాజకీయ పార్టీల ప్రచారంతో హోరెత్తింది…నేడు ఓటరు జోరు కొనసాగుతుంది. అనూహ్యంగా వచ్చిన మునుగోడు ఉపఎన్నికలో ఓటు వేసేందుకు ఓటర్లు పెద్ద ఎత్తున వస్తున్నారు. మధ్యాహ్నం 1 గంట సమయానికి 41.3 శాతం పోలింగ్ నమోదైంది..ఇంకా పోలింగ్ ముగిసే సమయానికి ఈ శాతం డబుల్ అవ్వడమే కాదు..ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.

ఓ వైపు ఓటర్ల జోరు కొనసాగుతుండగానే..మరో వైపౌ పార్టీల హోరు ఆగలేదు. ఇంకా ఓటర్లని ఆకట్టుకోవడానికి పార్టీలు ప్రయత్నిస్తూనే ఉన్నాయి. ఏ ఒక్క ఓటు కూడా పోకూడదనే లక్ష్యంతో పార్టీలు పనిచేస్తున్నాయి. ఇప్పటికే వందల కోట్లు కుమ్మరించారు..పోలింగ్ రోజు కూడా ఓటర్లని ప్రసన్నం చేసుకోవడం కోసం కోట్లు కుమ్మరిస్తున్నారని తెలుస్తోంది. అయితే అనుకున్న విధంగా డబ్బులు ఇవ్వలేదని ఓటర్లు చెప్పడం విశేషం..ఒక పార్టీ తులం బంగారం ఇస్తానని చెప్పింది అని, కానీ  ఇవ్వలేదని, మరొకరు ఓటుకు 30 వేలు ఇస్తానని అన్నారని, కానీ 3 వేలు మాత్రమే ఇచ్చారని ఓటర్లు మాట్లాడటం ఆశ్చర్యం కలిగిస్తుంది.

ఇక పోలింగ్ బూతులు దగ్గర ప్రధాన పార్టీల హడావిడి ఎక్కువైంది. బూతుల దగ్గరకు వెళ్ళి మరీ ఓటర్లని ప్రలోభ పెట్టే కార్యక్రమం చేస్తున్నారు. ఒక పార్టీ ప్రలోభ పెడితే..మరొక పార్టీ అడ్డుకుంటుంది. అలాగే ఎన్నిక జరుగుతుందగా కూడా లక్షల లక్షల సొమ్ము పట్టుబడుతుంది. ఇక ప్రతి గ్రామంలో టీఆర్ఎస్-బీజేపీ శ్రేణుల మధ్య వాదోపవాదాలు నడుస్తున్నాయి. ఆఖరికి తిట్టుకోవడం, కొట్టుకోవడం వరకు వెళ్లిపోతున్నారు. అలాగే ఒకరిపై ఒకరు ఫేక్ ప్రచారాలు చేసుకుంటున్నారు.

ఇలా ఓ వైపు నడుస్తుంటే మరోవైపు ఇండిపెండెంట్ పోటీ చేసిన కే‌ఏ పాల్ పోలింగ్ బూతుల వద్ద సందడి చేస్తున్నారు. అన్నీ బూతుల దగ్గర హల్చల్ చేస్తూ..పోలింగ్ సరళిని పరిశీలిస్తున్నారు. ఇక తన గుర్తు అయిన ఉంగరాన్ని పది వేళ్ళకు పెట్టుకుని హడావిడి చేస్తున్నారు. మీడియా ప్రశ్నిస్తే.. కారు గుర్తు ఉన్న టీఆర్ఎస్ వాళ్ళు కార్లలో తిరుగుతున్నారు..తాను ఉంగరాలు పెట్టుకుంటే తప్పేంటి అని లాజిక్ చెబుతున్నారు. మొత్తానికి మునుగోడులో ఓ యుద్ధమే నడుస్తోంది.

ReplyForward

Read more RELATED
Recommended to you

Exit mobile version