తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న సమయంలో ఏపీలో ఎమ్మార్వో వనజాక్షి వ్యవహారం అందరికీ తెలిసిందే. దెందులూరు మాజీ ఎమ్మెల్యే టిడిపి నాయకుడు చింతమనేని ప్రభాకర్ ఆమెపై దాడి చేసినట్లు, జుట్టు పట్టుకొని కొట్టినట్లు అప్పట్లో అనేక వార్తలు వచ్చాయి. ఆ సమయంలో చంద్రబాబు ప్రభుత్వం పై అనేక విమర్శలు వచ్చాయి. చింతమనేని ప్రభాకర్ ని పార్టీ నుండి సస్పెండ్ చేయాలని ప్రతిపక్షంలో ఉన్న వైసిపి డిమాండ్ చేసింది. అయినా కానీ అవేమీ జరగలేదు. ఆ తర్వాత ఎన్నికలు రావడం టీడీపీ ఓడిపోవడంతో వైస్సార్సీపీ అధికారం లోకి రావటం తో సీన్ మొత్తం పూర్తిగా మారిపోయింది.
అప్పట్లో అధికారంలో ఉన్న టీడీపీ నాయకులకు అడ్డుగా వెళ్లిన వనజాక్షి, తాజాగా వైసీపీ పార్టీ నాయకులు కూడా అలాగే వ్యవహరించడంతో రూల్స్ మాట్లాడిందంట. ఒక వ్యవహారంలో వైసీపీ పార్టీ నాయకుడు చట్టానికి వ్యతిరేకంగా తన పరిధిలో ఉన్న అంశంలో ప్రవర్తిస్తున్న తరుణంలో వనజాక్షి వెంటనే సదరు వైసిపి నాయకులు చేస్తున్న పని నీ తప్పు పట్టడం స్టార్ట్ చేసింది. దీంతో వెంటనే వైసీపీ నాయకులు ఆమెను వేరే ప్రాంతానికి ట్రాన్స్ ఫర్ చేశారు. ఈ పరిణామంతో వనజాక్షి పార్టీలు వేరైనా గని పొలిటికల్ లీడర్ ల మనస్తత్వాలు ఒకటే అని బోధపడింది.