ప్రతిపక్ష ఇండియా కూటమికి పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ షాక్ ఇచ్చింది వచ్చే లోక్సభ ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్లో ఒంటరి గానే పోటీ చేయబోతున్నామని ఆమె వెల్లడించారు. బెంగాల్లో సీట్ల సర్దుబాటు మీద కాంగ్రెస్ తో ఎటువంటి సంప్రదింపులు జరపలేదని అన్నారు. ఫలితాలు తర్వాతే పొత్తు పై తుది నిర్ణయం తీసుకుంటామని అన్నారు.
ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని బిజెపి ప్రభుత్వాన్ని గద్దించడమే లక్ష్యంగా ప్రతిపక్షాలు ఇండియా కూటమిగా ఏర్పడ్డాయని అన్నారు. ఈ కూటమి లో తృణమూల్ కాంగ్రెస్ కూడా భాగస్వామిగా ఉందన్నారు ఎన్నికల మీద రాష్ట్రాల వారీగా కూటమి లోని పార్టీల మధ్య సీట్ల పంపకాల విషయం లో చర్యలు చర్చలు కొనసాగుతున్నాయని అన్నారు మమతా బెనర్జీ, తాజాగా ప్రకటన చేయడం అందరికీ గట్టి షాక్ ఇచ్చింది.