సీఎం రేవంత్ రెడ్డికి.. సినీ హీరో నాగార్జునకి ఎక్కడ చెడింది..?

-

హైదరాబాద్ లో ఉన్న అక్కినేని నాగార్జునకు చెందిన ‘ఎన్ కన్వెన్షన్’ను కూల్చెయ్యడం ఇప్పుడు సినీ, రాజకీయవర్గాల్లో సంచలనంగా మారింది.. తుమ్మడి చెరువును ఆక్రమించి నాగార్జున కన్వెన్షన్ సెంటర్ ను నిర్మించారని అధికారులు చెబుతున్నారు.. కానీ నాగార్జున మాత్రం అధికారుల మాటలను కొట్టిపారేస్తున్నారు.. తాము ఎక్కడా భూ కబ్జాలకు పాల్పడలేదని ఆయన స్పష్టం చేస్తున్నారు..

akkineni nagarjuna revanth reddy

హైదరాబాద్ లో గత కొద్దిరోజులుగా అక్రమ కట్టడాలపై అధికారులు కొరఢా ఝులిపిస్తున్నారు.. భారీ భవంతులను కూల్చేస్తున్నారు.. ఇప్పటికే చాలా కట్టడాలను కూల్చేసిన అధికారులు అక్కినేని నాగార్జునకు చెందిన ‘ఎన్ కన్వెన్షన్’ను సైతం నేలమట్టం చేశారు.. ప్రస్తుతం ఇదే రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.. సీఎం రేవంత్ రెడ్డికి, నాగార్జునకు ఏమైనా విభేదాలు ఉన్నాయా అనే కోణం లో చర్చలు నడుస్తున్నాయి..

సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్న సమయంలో కూడా పలు సందర్బాల్లో ‘ఎన్’ కన్వెన్షన్ గురించి ఆయన ప్రస్తావించిన అంశం తెరమీదకొచ్చింది.. టీడీపీ ఎమ్మెల్యేగా ఉండగానే చెరువు మధ్యలో గోడ కట్టి.. ఈ ‘ఎన్ కన్వెన్షన్’ను నిర్మించారంటూ అసెంబ్లీలో ఆయన ప్రస్తావించారట.. కాంగ్రెస్ లో ఉన్నప్పుడు కూడా ఇదే విషయాన్ని ఆయన మాట్లాడారు..

అయితే తమ పార్టీకి నాగార్జున సన్నిహితంగా ఉండటం వల్లే రేవంత్ రెడ్డి ఇలాంటి చర్యలకు పూనుకున్నారనే చర్చ బీఆర్ ఎస్ నేతల మధ్య జరుగుతోంది.. అయితే కాంగ్రెస్ మాత్రం ‘ఎన్ కన్వెన్షన్’ను కూల్చెయ్యడంలో ఎలాంటి రాజకీయం లేదని వివరణ ఇస్తోంది.. మొత్తంగా కన్వెన్షన్ కూల్చివేత తెలంగాణలో హాట్ టాపిక్ గా ఉంది..

Read more RELATED
Recommended to you

Latest news