ఇంతకు ప్రతిపక్ష నేతను తెగ విమర్శించి, సొంత కొంపలేని నేత ఎవరనుంటున్నారా.. ఇంకేవరు ఐదేండ్లు ముఖ్యమంత్రిగా పనిచేసి ప్రస్తుతం ప్రతిపక్ష నేతగా ఉన్న ఘనత వహించిన నారా చంద్రబాబు నాయుడు. ఏందీ చంద్రబాబు నాయుడుకు అమరావతిలో సొంత కొంప లేదా.. ఇది నమ్మలేం సుమా.. ఇంతకాలం ఎక్కడున్నాడు.. ఎక్కడి నుంచి పరిపాలన చేసాడు అనుకుంటున్నారా.. నిజమే సుమా సొంతకొంప లేదు అంటే నమ్మరేంటీ సుమా.. ఆయన ఇంతకాలం ఉన్నది కేవలం అద్దెకొంపలో.. అది కూడా అక్రమంగా నిర్మించిన ఇంటిలో అంటే నమ్మకశ్యం కాదు కదా.. నిజమే.. ఇప్పుడు ఈ అద్దె కొంపపై వివాదం నెలకొన్నడంతో అసలు విషయం బయటికి వచ్చింది.. నారా చంద్రబాబునాయుడు ఉంటుంది ఓ వ్యాపారవేత్త లింగమనేని రమేష్ అనే వక్తికి చెందిన గెస్ట్ హౌజ్‌లో నట. ఇది ఏపీలో అధికారం మారిన తరువాత తెలిసింది.
ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత కృష్ణా కరకట్టపై టీడీపీ ప్రభుత్వం నిర్మించిన ఓ భవనాన్ని అక్రమ కట్టడం అంటూ కూల్చివేశారు. కరకట్టపై నిర్మించిన అక్రమ కట్టడాలను కూల్చాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. అయితే కృష్ణ కరకట్టపైనే ఉన్న మాజీ సీఎం చంద్రబాబు నివాసం ఉండే ఇల్లు అక్రమ కట్టడం అంటూ నోటీసులు ఇచ్చారు. దీనిపై గతంలో టీడీపీ, వైసీపీ నడుమ మాటల యుద్దం నడిచింది. చివరికి ఇంటి యజమాని లింగమనేని రమేష్‌కు నోటీసులు ఇచ్చింది సీఆర్‌డీఏ. దీనికి స్పందించిన లింగమనేని సమాధానం ఇచ్చాడు. కానీ సమాధానంకు సంతృప్తి చెందని సీఆర్‌డీఏ అధికారులు మరోమారు నోటీసులు పంపారు. లింగమనేని రమేశ్ పేరుతో..గెస్ట్‌హౌజ్ గోడకు అధికారులు శనివారం నోటీసులు అంటించారు.
ఇందులో భాగంగా గ్రౌండ్‌ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్, స్విమ్మింగ్‌పూల్, ఫస్ట్‌ఫ్లోర్ డ్రెస్సింగ్ రూం నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయని, వారం రోజుల్లోగా ఇల్లు ఖాళీ చేయాలని నోటీసులో పేర్కొన్నారు ఈ నోటీసులు పంపడంతో ప్రతిపక్ష నేత చంద్రబాబు, ఆయన తాబేదార్లు నోటికొచ్చినట్లు అవాకులు చవాకులు పేలుతున్నారు. చంద్రబాబు అమరావతిలో నివాసం ఉంటుంది సొంత కొంప కాదు.. అద్దె కొంప. ఐదేండ్లుగా ఇదే అద్దె కొంపలో అందులో అక్రమకట్టడంలో నివాసం ఉంటూ ఇప్పుడు అక్రమ కట్టడాన్ని కూల్చుతామంటే చెవి కోసిన మేకల్లా ఒకటే అరుపులు అరుస్తున్నారు. ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడే వైఎస్ జగన్ తాడేపల్లిలో ఇల్లు నిర్మించుకుని గృహప్రవేశం చేసి, అధికారంలోకి రాగానే తన సొంత ఇంటి నుంచే పరిపాలన చేస్తున్నాడు.
జనసేన పార్టీని స్థాపించి సొంత ఇంటిని కూడా నిర్మించుకుని సంసారం చేస్తున్నారు పవన్ కళ్యాణ్. మరి ఐదేండ్లు అధికారం చేసిన ముఖ్యమంత్రి సొంత ఇల్లు నిర్మించుకోకుండా, అద్దె కొంపలో ఉంటూ అక్రమ కట్టడంగా గుర్తించి కూల్చివేసేందుకు అధికారులు సిద్ధమైతే.. అందులో ఉండకుండా ఖాళీ చేయాల్సిన చంద్రబాబు నాయుడు కుట్ర రాజకీయాలు అంటూ అనవసరమైన కూతలు కూయడం పట్ల ఏపీ ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. అసలు అద్దె కొంపకు నోటీసులు ఇస్తే చంద్రబాబుకు ఎందుకు అంత ఉలుకు.
అసలు సొంత కొంప కట్టుకుంటే చంద్రబాబు కు ఇంత దుస్థితి రాదు కదా.. అక్రమ కట్టడాలు కూల్చివేస్తారన్న విషయం సీఎంగా పనిచేసిన నేతకు ఒకరు చెప్పాలా.. ఒకరితో చెప్పించుకోవాల్సిన అవసరం ఎందుకు తెచ్చుకోవడం.. అద్దె కొంపను ఖాళీ చేసి సొంత కొంప నిర్మించుకుంటే సీనియర్ నేతగా గౌరవంగా ఉండొచ్చు.. ఇతరులకు ఆదర్శంగా ఉండొచ్చు.. కదా చంద్రాలు… ఏపీ సీఎం వైఎస్ జగన్ ను, జనసేన అధినేత పవన్‌ను చంద్రాలు ఆదర్శంగా తీసుకుని సొంత కొంప నిర్మించుకుని అద్దె కొంపకు స్వస్తి పలుకుతారని ఆశిద్దాం..