రఘురామని రౌండప్ చేస్తున్న వైసీపీ…బాబు ఆ పని ఎందుకు చేయట్లేదు…!

-

తమ పార్టీకి పెద్ద తలనొప్పిగా మారిన ఎంపీ రఘురామకృష్ణంరాజుకు చెక్ పెట్టడానికి వైసీపీ గట్టిగానే కష్టపడుతుంది. ఎప్పుడైతే వైసీపీ నుంచి ఎంపీగా గెలిచి అదే పార్టీకి వ్యతిరేకంగా గళం విప్పుతున్న రాజుగారి పదవి పోయేలా చేయాలని జగన్ ప్రభుత్వం బాగానే ప్రయత్నిస్తుంది. రఘురామని డిస్‌క్వాలిఫై చేయాలని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు పలుమార్లు ఫిర్యాదు చేశారు. ఈ మధ్యే వైసీపీ ఎంపీ భరత్ సైతం స్పీకర్‌ని కలిసి రఘురామపై వేటు వేయాలని కోరారు.

అయితే ఓ వైపు వైసీపీ నేతలు స్పీకర్‌కు ఫిర్యాదు చేస్తున్నా కూడా రఘురామ ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా ప్రభుత్వంపై విమర్శలు చేస్తూనే ఉన్నారు. ఇటీవల వరుసపెట్టి జగన్‌కు లేఖలు రాస్తున్నారు. పలు హామీలని జగన్ నిలబెట్టుకోవడంలేదని లేఖల్లో ప్రస్తావిస్తున్నారు. ఎన్నికల ముందు హామీలు ఇచ్చి, వాటిని విస్మరిస్తున్నారని అంటున్నారు. ఇలా తమ ప్రభుత్వంపై లేఖాస్త్రాలు సంధిస్తున్న రఘురామపై వేటు వేయాలని లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లాకు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి లేఖ రాశారు.

పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న ఎంపీ రఘురామకృష్ణంరాజుపై అనర్హత వేటు వేసేందుకు తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే అనర్హత వేటుకు సంబంధించి పలు రూల్స్ కూడా లేఖలో ప్రస్తావించారు. మరి రఘురామపై స్పీకర్ వేటు వేస్తారో లేదో రానున్న రోజుల్లో తెలుస్తోంది.

అయితే తమ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని రఘురామపై వేటు వేయాలని వైసీపీ నేతలు లోక్‌సభ స్పీకర్ చుట్టూ తిరుగుతున్నారు. కానీ టీడీపీ నుంచి గెలిచి వైసీపీకి మద్ధతు తెలిపిన నలుగురు ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని చంద్రబాబు, ఏపీ స్పీకర్‌ని కోరిన సందర్భాలు లేవు. పైగా వారు కూడా పార్టీకి వ్యతిరేకంగానే మాట్లాడుతున్నారు. అలాంటప్పుడు చంద్రబాబు, ఆ నలుగురుపై వేటు వేయాలని డిమాండ్ చేయడం లేదు. గతంలో వైసీపీ ఎమ్మెల్యేలని టీడీపీలో చేర్చుకున్న చంద్రబాబు, ఇప్పుడు వైసీపీ వైపు వెళ్ళిన తమ ఎమ్మెల్యేలపై వేటు వేయాలని డిమాండ్ చేయలేకపోతున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version