తెలంగాణ రాజకీయాల్లో బీజేపీ బలం తగ్గుతుందా? కాంగ్రెస్ రేసులోకి వచ్చాక టీఆర్ఎస్‌కు పోటీ ఇచ్చే శక్తి బిజేపికి తగ్గిందా? అంటే ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్తితులని బట్టి చూస్తే తెలంగాణలో బీజేపీలో కాస్త ఊపు తగ్గినట్లే కనిపిస్తోంది. మొన్నటివరకు తెలంగాణలో టిఆర్‌ఎస్‌తో బిజేపినే ఢీ అంటే ఢీ అనేలా రాజకీయం చేసింది. ముఖ్యంగా బండి సంజయ్ అధ్యక్షుడు అయ్యాక బిజేపి మరింత పుంజుకుంది. ఊహించని విధంగా దుబ్బాక ఉపఎన్నికలో టీఆర్ఎస్‌ని ఓడించడం, జిహెచ్‌ఎంసి ఎన్నికల్లో దాదాపు టీఆర్ఎస్‌ని ఓడించినంత పని చేయడంతో బిజేపికి అనూహ్యంగా కొత్త బలం వచ్చింది.
కానీ రేవంత్ మాదిరిగా బండి..టిఆర్‌ఎస్ ప్రభుత్వంపై దూకుడుగా వెళ్ళడం ఈ మధ్య తగ్గించారు. అనూహ్యంగా బిజేపి దూకుడు తగ్గింది. ఇలా బిజేపిలో మార్పు రావడంతో కాంగ్రెస్‌కు బాగా ప్లస్ అవుతూ వచ్చింది. ప్రజా సమస్యలపై పోరాటం చేయడంలో కూడా బండి కాస్త గాడి తప్పినట్లే కనిపించింది. దీంతో బిజేపి పికప్ అవ్వడం ఆగింది.