రాజ‌ధాని పై క్లారిటీ లేక‌నే పెట్టుప‌డులు వ‌స్త‌లేవు – ఎంపీ రామ్మోహ‌న్ రాయుడు

ఆంధ్ర ప్ర‌దేశ్ లో రాజ‌ధానుల గొడ‌వ ఇంకా ముదురుతుంది. ఈ రోజు జ‌గ‌న్ ప్ర‌భుత్వం అసెంబ్లీ లో మూడు రాజ‌ధానుల బిల్లు ఉప‌సంహ‌రించు కున్న విష‌యం తెలిసిందే. దీని పై టీడీపీ ఎంపీ రామ్మోహ‌న్ రాయుడు స్పందించాడు. అన్ని రాష్ట్రాల కు రాజ‌ధానులు ఉన్నాయ‌ని అన్నారు. అందుకే అన్ని రాష్ట్రా ల లో ప్ర‌యివేటు కంపెనీలు పెట్టు బ‌డులు పెట్ట డానికి ముందుకు వ‌స్తున్నాయ‌ని అన్నారు.

కానీ ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్రా ని కి ఇప్ప‌టి వ‌ర‌కు రాజ‌ధాని విష‌యం లో క్లారిటీ లేద‌ని అన్నారు. అందుకే ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్రానికి పెట్టుబ‌డుటు పెట్ట‌డాని కి ఎ కంపెనీ కూడా ముందుకు రావ‌డం లేద‌ని తెలిపారు. అందుకే ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్రంలో అభివృద్ధి జ‌ర‌గ‌డం లేద‌ని అన్నారు. అలాగే వైసీపీ కి పాల‌న చేత కాద‌ని విమ‌ర్శించారు. ప‌ద‌వీ కాలం స‌గం పూర్తి అయిన ఇంత వ‌ర‌కు రాజ‌ధాని పై క్లారిటీ ఇవ్వ‌లేద‌ని విమ‌ర్శించారు.