కేఏపాల్ నన్ను మోసం చేశాడు.. ఫిర్యాదు చేసిన మహిళ

-

Woman files case against kapaul

ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకుడు కేఏపాల్ మోసం చేశాడంటూ ఓ మహిళ ఫిర్యాదు చేసింది. తనను అమెరికా పంపిస్తానంటూ కేఏ పాల్ డబ్బులు తీసుకొని మోసం చేశాడని సత్యవతి అనే మహిళ ఆరోపించింది.

హైదరాబాద్ లోని బీహెచ్ఈఎల్ కు చెందిన సత్యవతి వ్యాపారం చేస్తుంటారు. అయితే.. ఆమెను యూఎస్ పంపిస్తానంటూ తన దగ్గర రెండు లక్షల రూపాయల చెక్ ను కేఏపాల్ తీసుకున్నారట. చెక్ తీసుకున్న తర్వాత తనకు ఇన్విటేషన్ కార్డు, స్పాన్సర్ షిప్ లెటర్ కూడా ఇచ్చారని.. తర్వాత వీసా మాత్రం ఇవ్వలేదని ఆరోపించారు.

చెక్ ద్వారా డబ్బులు డ్రా చేసుకొని తన నెంబర్ ను బ్లాక్ లిస్ట్ లో పెట్టాడని.. తనకు న్యాయం చేయాలంటూ సత్యవతి పంజాగుట్ట పోలీసులను ఆశ్రయించారు. ఆమె ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. సెక్షన్ 420, 406, రెడ్ విత్ 30 కింద పోలీసులు కేఏపాల్ పై కేసు నమోదు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news