హైదరాబాద్ లోని మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల అభి వృద్ధి కేంద్రంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన సీఎల్పీ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలను తీసుకున్నట్టు ప్రకటించారు. ఇటీవల పార్టీ లైన్ దాటుతున్న నేతల అంశం పై సీఎల్పీ సమావేశంలో చర్చించారు. ఎవరైనా నేతలు కాంగ్రెస్ పార్టీ నిర్ణయాలను వ్యతిరేకిస్తే.. కఠినంగా వ్యవహరించాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.
అలాగే పార్టీ విధానాలపై ఎవరికైనా అనుమానాలు ఉంటే.. అంతర్ఘతంగా చర్చించాలని ఈ సందర్భంగా సీనియర్ కాంగ్రెస్ నేతలు సూచించినట్టు తెలుస్తోంది. అంతకు ముందు స్థానిక సంస్థల ఎన్నికల్లో కార్యచరణ పై ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేశారు. బీసీ కులగణన, ఎస్సీ వర్గీకరణ పై కీలకంగా చర్చించారు. ఈరెండు చారిత్రాత్మకమైన నిర్ణయాలను ప్రజల్లోకి తీసుకెల్లాలని ఆదేశించారు. బీసీ కులగణనతో పాటు ఎస్సీ వర్గీకరణ పై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై రెండు భారీ బహిరంగ సభలు పెట్టాలని నిర్ణయించారు.