నెక్స్ట్ ఎన్నికల్లో గెలవాలని చెప్పి అటు అధికార వైసీపీ, ఇటు ప్రతిపక్ష టీడీపీలు గట్టిగా పోటీ పడుతున్నాయి. ఈ సారి గెలుపు అనేది రెండు పార్టీలకు కీలకంగా మారిపోయాయి. టోటల్ గా కక్షపూరిత రాజకీయాలు ఉన్న నేపథ్యంలో మళ్ళీ వైసీపీని గాని అధికారంలోకి వస్తే టిడిపి చాప్టర్ క్లోజ్ అని చెప్పవచ్చు. ఇక పొరపాటున టిడిపి అధికారంలోకి వస్తే వైసీపీ పై రివెంజ్ ఎలా ఉంటుందో చెప్పాల్సిన పని లేదు. అందుకే ఈ సారి ఎన్నికలు రెండు పార్టీలకు కీలకమనే చెప్పాలి.
ఈ సారి ఎన్నికల్లో జనసేన కొంతమేర ప్రభావం చూపవచ్చు..అయితే జనసేన వల్ల ఓట్ల చీలిక ఉంటుంది. గత ఎన్నికల్లో జనసేన ఓట్లు చీల్చి వైసీపీకి లాభం, టిడిపికి నష్టం చేసిన విషయం తెలిసిందే. కానీ ఈ సారి ఆ పరిస్తితి రానివ్వకూడదు అని చెప్పి చంద్రబాబు..పవన్‌ని కలుపుకుని వెళ్లాలని చూస్తున్నారు. అటు పవన్ సైతం ఒంటరిగా అధికారంలోకి రావడం కష్టం..పైగా జగన్ ని గద్దె దించాలంటే బాబుతో కలవాలని అనుకుంటున్నారు. ఈ క్రమంలోనే చంద్రబాబు, పవన్ భేటీలు జరుగుతున్నాయి. దీని బట్టి చూస్తే వచ్చే ఎన్నికల్లో టిడిపి-జనసేన పొత్తు దాదాపు ఫిక్స్ అని చెప్పవచ్చు. అందులో ఎలాంటి డౌట్ లేదు.
అయితే టిడిపి-జనసేన కలిస్తే వైసీపీకి టెన్షన్..అందుకే పొత్తు చెడగొట్టడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తూనే వస్తున్నారు. ఈ క్రమంలోనే టిడిపితో కలవడం వల్ల జనసేన పతనం అవుతుందని వైసీపీ నేతలు అంటున్నారు. కానీ అక్కడ వాస్తవం వేరుగా ఉంది. టిడిపి-జనసేన కలవడం వల్ల వైసీపీ పతనం అని విశ్లేషకులు అంటున్నారు.
రెండు పార్టీలు పొత్తు పెట్టుకుంటే వైసీపీకి నష్టం ఖాయమనే చెప్పవచ్చు. అందులో ఎలాంటి డౌట్ లేదు. కనీస రాజకీయ పరిజ్ఞానం ఉన్నవారికి టిడిపి-జనసేన వల్ల వైసీపీకి నష్టమని అర్ధమవుతుంది.