వైసీపీ వర్సెస్ పవన్..టీడీపీ సైడ్ అయినట్లే.!

-

ఏపీలో రాజకీయం రోజుకో మలుపు తిరుగుతుంది. అయితే మొన్నటివరకు ప్రధాన పార్టీలైన వైసీపీ, టి‌డి‌పిల మధ్య రాజకీయ పోరు హోరాహోరీగా జరుగుతూ వచ్చింది. కానీ ఎప్పుడైతే పవన్ వారాహి యాత్ర మొదలుపెట్టారో అప్పటినుంచి సీన్ మారిపోయింది. వారాహి యాత్రతో పవన్ దూసుకెళుతున్నారు. ఉమ్మడి గోదావరి జిల్లాల్లో తన యాత్ర విజయవంతంగా సాగుతుంది. ప్రజా స్పందన పెద్ద ఎత్తున వస్తుంది.

ఇదే సమయంలో పవన్..జగన్ ప్రభుత్వం టార్గెట్ గా తీవ్ర విమర్శలు చేయడం..అటు వైసీపీ నేతలు..పవన్‌ని టార్గెట్ చేసి తిట్టడంతో రాజకీయ యుద్ధం తీవ్రంగా సాగుతుని. ఇక పవన్..వాలంటీర్ వ్యవస్థ టార్గెట్ చేసిన కామెంట్లపై పెద్ద ఎత్తున రచ్చ నడుస్తుంది. ఇలా పవన్ వర్సెస్ వైసీపీ అన్నట్లు రాజకీయం యుద్ధం నడుస్తుంది. ఈ పోరులో టి‌డి‌పి సైలెంట్ గా ఉంది. కాకపోతే టి‌డి‌పి సైలెంట్ గా వర్క్ చేసుకుంటుంది. ఇప్పటికే లోకేశ్ పాదయాత్ర కొనసాగుతున్న విషయం తెలిసిందే. అటు టి‌డి‌పి నేతల భవిష్యత్తుకు గ్యారెంటీ బస్సు యాత్ర జరుగుతుంది.

వారు సైలెంట్ గా జనంలోకి వెళ్ళి పనిచేసుకుంటున్నారు. అయితే పవన్ వారాహి యాత్ర చేస్తున్న నేపథ్యంలో చంద్రబాబు జనంలోకి రావడం లేదు. అంటే తెలివిగానే పవన్ జనంలో ఉండటం వల్ల..మీడియా ఫోకస్ మొత్తం అటువైపు ఉండాలని, మళ్ళీ తాను జనంలోకి వస్తే మీడియా అటెన్షన్ రెండు రకాలుగా వెళుతుందని భావించి..బాబు కేవలం పార్టీ కార్యక్రమాలకే పరిమితమయ్యారు.

ఇక పవన్ వారాహి యాత్ర ముగిశాక చంద్రబాబు ప్రజల్లోకి వస్తారని తెలుస్తుంది. అంటే ఒకరి తర్వాత ఒకరు జగన్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసి ముందుకెళ్లనున్నారు. అయితే వైసీపీ వర్సెస్ పవన్ అన్నట్లు సాగుతున్న ఈ వార్ లో టి‌డి‌పి రాజకీయంగా ఇంకా వెనుకబడితే ఆ పార్టీకే నష్టం.

Read more RELATED
Recommended to you

Latest news