తెలంగాణ‌లో 18 ఏళ్లు దాటినా ఓటు వేయలేకపోతున్న యూత్.. ఎందుకంటే..?

-

తెలంగాణలో వచ్చే సంవత్సరం ఫిబ్రవరిలోగా మునిసిపల్ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. అయితే ఈ మునిసిపల్ ఎన్నికల్లో 18 సంవత్సరాలు దాటినా ఓటు హక్కును వినియోగించుకోలేని వింత పరిస్థితి తలెత్తింది. 2019 జనవరి 1 అర్హత తేదీగా ఓటర్ల జాబితాను ప్రకటించడమే ఇందుకు కారణం. అంటే, 2019 జనవరి 1 తరువాత 18 సంవత్సరాలు నిండిన వారెవరూ ఓటు వేసే పరిస్థితి లేదు. వాస్తవానికి వచ్చే సంవత్సరం ఫిబ్రవరి 7న అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా తుది ఓటర్ల జాబితాను ఈసీ ప్రకటిస్తుంది. ఆపై మార్చిలో ఎన్నికలు నిర్వహించాలి.

ఆ సమయంలో విద్యార్థులకు పరీక్షలు ఉంటాయి కాబట్టి, మే వరకూ ఆగకుండా, ఫిబ్రవరిలోగా ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తూ, ఈ సంవత్సరం జనవరి 1 అర్హత తేదీగా ఓటర్ల జాబితాను రూపొందిస్తోంది. ఈ నెల 16న కేంద్ర ఎన్నికల సంఘం ఓ ముసాయిదా ఓటర్ల జాబితాను విడుదల చేసింది. దీనిలో ఓటర్లుగా పేర్లు లేకుంటే, వారు నమోదు చేయించుకోవాలని, నోటిఫికేషన్ వచ్చేలోగా నమోదు చేసుకుంటే ఓటు వేయవచ్చని అధికారులు అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news