100 పరుగులకే సరిపెట్టాలి అనుకున్నాం.. కానీ..!

-

ముంబై ఇండియన్స్ చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య మ్యాచ్ జరుగగా.. చెన్నై ఎవరూ ఊహించని విధంగా తీవ్రస్థాయిలో పేలవ ప్రదర్శన చేసి తీవ్ర విమర్శల పాలైన విషయం తెలిసిందే. ఐపీఎల్ లో దిగ్గజ జట్టుగా ప్రస్థానాన్ని కొనసాగించిన చెన్నై సూపర్ కింగ్స్ కనీస స్థాయికి తగ్గ ప్రదర్శన కూడా చేయలేక పోయింది. పవర్ ప్లే ముగిసేసరికి ఐదు కీలక వికెట్లు కోల్పోయింది చెన్నై సూపర్ కింగ్స్ జట్టు. దీంతో అతి కష్టం మీద వందకు పైగా పరుగులు చేసిన విషయం తెలిసిందే. ఇక ఈ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ జట్టు ఘన విజయం సాధించింది. ఇక మ్యాచ్ అనంతరం మాట్లాడిన ముంబై ఇండియన్స్ జట్టు కెప్టెన్ పొలార్డ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

పవర్ ప్లే ముగిసేసరికి ఐదు కీలక వికెట్లు పడగొట్టడం ఎంతో ఆనందాన్ని కలిగించింది అంటూ చెప్పుకొచ్చాడు.. చెన్నై జట్టును కేవలం 100 పరుగుల లోపే కట్టడి చేయాలని ముందుగా అనుకున్నామని చెప్పుకొచ్చాడు. కానీ చివర్లో ఊహించని విధంగా సామ్ కరణ్ రాణించడంతో చెన్నై జట్టు ఒక గౌరవప్రదమైన స్కోరు చేయగలిగింది అంటూ తెలిపాడు పొలార్డ్. ఇక నిన్న తమ జట్టు ఒక వికెట్ కూడా కోల్పోకుండా ఘన విజయాన్ని సాధించడం ఎంతో ఆనందాన్ని కలిగించింది అంటూ చెప్పుకొచ్చాడు.

Read more RELATED
Recommended to you

Latest news