ఎంతో బాధగా ఉంది : ధోని

ఐపీఎల్ చరిత్రలోనే దిగ్గజ జట్టు గా పేరున్న చెన్నై సూపర్ కింగ్స్ ఈ సీజన్ లో మాత్రం తీవ్ర స్థాయిలో విమర్శలు ఎదుర్కొంటూ స్థాయికి తగ్గ ప్రదర్శన చేయడం లేదు అన్న విషయం తెలిసిందే. వరుస ఓటమి చవి చూస్తూ చివరికి ప్లే ఆఫ్ ఆశలను వదిలేసుకుంది. ప్లే ఆఫ్ ఆశలు వదులుకున్న తర్వాత అయినా చెలరేగి ఆడుతుందని అనుకుంటే మళ్లీ పేలవ ప్రదర్శనతో అభిమానులను నిరాశపరిచింది చెన్నై సూపర్ కింగ్స్ జట్టు. కాగా నిన్న చెన్నై సూపర్ కింగ్స్ ముంబై ఇండియన్స్ జట్ల మధ్య మ్యాచ్ జరుగగా పేలవ ప్రదర్శన చేసిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ముంబై చేతిలో ఘోర ఓటమి చవిచూసిన విషయం తెలిసిందే. మ్యాచ్ అనంతరం మాట్లాడిన జట్టు సారథి మహేంద్ర సింగ్ ధోనీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

dhoni

చెన్నై సూపర్ కింగ్స్ జట్టు వరుస ఓటములు చవి చూస్తూ ఉండడం తనను ఎంతగానో బాధ కలిగిస్తుంది అని చెప్పిన మహేంద్రసింగ్ ధోని… జట్టులోని ఆటగాళ్లు ఒక్కరు కూడా తమ స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోతున్నారు అంటూ చెప్పుకొచ్చాడు. జట్టులో ఎక్కడ తప్పులు జరుగుతున్నాయో తెలుసుకోవాల్సిన అవసరం ఉందని కనీసం తర్వాత మ్యాచ్లోనైనా గెలిచేందుకు ప్రయత్నిస్తామని తెలిపారు మహేంద్రసింగ్ ధోని.