ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్.. అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. తెలుగు రాష్ట్రాల్లో గ్రాడ్యుయేట్, ఉపాధ్యాయ MLC ఎన్నికల ప్రచారం ముగియడంతో తాయిలాలు పంచేందుకు ప్రధాన పార్టీలు సిద్ధమైనట్లు ప్రచారం జరుగుతోంది. ఇక ఇవాళ జరిగే ఎన్నికలకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. APలో 3 గ్రాడ్యుయేట్, 2 టీచర్, తెలంగాణలో 1 టీచర్, 1 స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికలు జరగనున్నాయి. ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తారు. 16న ఓట్ల లెక్కింపు ఉంటుంది.
ఇక అటు ఏపీ విద్యార్థులకు అలర్ట్. ప్రకాశం-నెల్లూరు-చిత్తూరు, కడప-అనంతపురం-కర్నూలు టీచర్ MLC స్థానాలకు ఇవాళ ఎన్నికలు జరగనుండగా, ఆయా ప్రాంతాల్లోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్ స్కూళ్లకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. తొలుత టీచర్లకు సెలవు ఇవ్వగా, విద్యార్థులు స్కూళ్లకు రావాలా? వద్దా? అనే సందిగ్ధం నెలకొంది. దీంతో టీచర్ MLC ఎన్నిక జరిగే జిల్లాలోని అన్ని స్కూళ్లకు సెలవు ఇచ్చి, కాలేజీల అధ్యాపకులకు మాత్రం స్పెషల్ CL ఇచ్చింది.