ఇటీవల జరిగిన పాలిటెక్నిక్ పేపర్ లీక్ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపింది. హైదరాబాద్ నగర శివారులో గల స్వాతి పాలిటెక్నిక్ కళాశాలలో ఈ నెల 8, 9 తేదీలలో పేపర్ లీక్ అయ్యాయి. ఈ పేపర్ లీక్ వ్యవహారం పై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ అయింది. పేపర్ లీక్ కు కారకులను వెంటనే పట్టుకోవాలని.. విచారణ వేగవంతం చేయాలని పోలీసులకు ఆదేశాలను కూడా జారీ చేసింది. కాగ ఈ పేపర్ లీక్ వ్యవహారంలో తాజా గా రాచకొండ పోలీసులు నలుగురిని అరెస్టు చేశారు.
అనంతరం రిమాండ్ కు తరలించారు. అయితే ఈ పేపర్ లీక్ వ్యవహారంలో కళాశాల యంత్రంగామే ఉందని పోలీసులు తెల్చారు. తమ కళాశాలలో ఉత్తిర్ణత శాతం పెరగాలని.. ప్రశ్నా పత్రాలను లీక్ చేసినట్టు పోలీసులు గుర్తించారు. ఈ వ్యవహారంలో కళాశాల అడ్మిన్ అధికారి కృష్ణ మూర్తి, చీఫ్ సూపరింటెండెంట్ వెంకటేశ్వర్లు, లెక్చరర్ కృష్ణ మోహన్ ముగ్గరు కలిసి పథకం ప్రకారం.. ప్రశ్నా పత్రాలను లీక్ చేశారని పోలీసులు తెలిపారు.
పరీక్ష సమయానికి ఆలస్యంగా రావాలని పరిశీలకుడు వెంకటరామిరెడ్డిని కూడా కోరారని.. అందుకు ఆయన కూడా సహకరించారని పోలీసులు తెల్చారు. కాగ వీరు చేసిన పేపర్ లీక్ ఇతర కళాశాలలకు కూడా వెళ్లాయని పోలీసులు తెలిపారు.