దూకుడు పెంచిన సీఎం కేసీఆర్.. 21న సంగారెడ్డి జిల్లా ప‌ర్య‌ట‌న

-

తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ దూకుడు పెంచాడు. వ‌రుస‌గా జిల్లాల ప‌ర్య‌ట‌నలు చేస్తున్నారు. ఇప్ప‌టికే జ‌న‌గామ, భువ‌న‌గిరి జిల్లాల్లో సీఎం కేసీఆర్ ప‌ర్య‌టించారు. తాజా గా మ‌రో జిల్లా ప‌ర్య‌ట‌న‌కు సిద్దం అయ్యారు. ఈ నెల 21 వ తేదీన సంగారెడ్డి జిల్లాలో ప‌ర్య‌టించాల‌ని సీఎం కేసీఆర్ నిర్ణ‌యించుకున్నారు. అందుకు సంబంధించిన షెడ్యూల్ కూడా ఖ‌రారు అయిన‌ట్టు తెలుస్తుంది. కాగ ఈ నెల 21న సంగారెడ్డి జిల్లా ప‌ర్య‌ట‌న‌లో భాగంగా.. నారాయ‌ణ ఖేడ్ లోని సంగ‌మేశ్వ‌ర – బ‌స‌వేశ్వ‌ర ప్రాజెక్టుకు సీఎం కేసీఆర్ శంకుస్థాప‌న చేయ‌నున్నారు.

అనంత‌రం బ‌హిరంగ స‌భ‌లో పాల్గొన‌నున్నారు. కాగ సీఎం కేసీఆర్ ఇప్పటి వ‌ర‌కు జ‌న‌గామ‌, భువ‌న‌గిరి జిల్లాల్లో క‌లెక్ట‌రెట్ ల‌ను, టీఆర్ఎస్ జిల్లా కార్యాల‌యాల‌ను ప్రారంభించారు. అనంతరం ఈ రెండు జిల్లాల్లో కూడా బహిరంగ స‌భల‌లో పాల్గొన్నారు. ఆయా బ‌హిరంగ స‌భ‌ల్లో సీఎం కేసీఆర్ ప్ర‌సంగం దేశ వ్యాప్తంగా చర్చ జ‌రిగింది. తాజా గా నారాయ‌ణ ఖేడ్ లో జ‌ర‌గ‌బోయే బ‌హిరంగ స‌భ‌లో సీఎం కేసీఆర్ ఎలా ప్ర‌సంగిస్తారో అని రాజకీయ నాయ‌కులు ఎదురు చూస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version