నిర్మాతలకు చుక్కలు చూపిస్తోన్న పూజాహెగ్డే…!

-

నిర్మాతలకు పట్టపగలే చుక్కలు చూపిస్తోంది పూజా హెగ్డే. బాలీవుడ్‌ ఇమేజ్‌ చూసుకుని సౌత్ మేకర్స్‌కి షాకుల మీద షాకులు ఇస్తోంది. టర్మ్స్‌ అండ్‌ కండీషన్స్‌కి ఒప్పుకుంటేనే సినిమా లేదంటే లేదు అన్నట్లుగా బిహేవ్ చేస్తోందట పూజా. ఈ బిహేవియర్‌తో నిర్మాతలు కూడా విసిగిపోతున్నారని టాక్ వస్తోంది. బాలీవుడ్‌లో హృతిక్ సరసన ‘మొహంజోదారో’ సినిమాలో యాక్ట్ చేసిన ఈ అమ్మడికి అదృష్టం కలిసిరాలేదు.ఆ తర్వాత హరీష్ శంకర్ దర్శకత్వంతో అల్లు అర్జున్ హీరోగా నటించిన ‘డీజే’ సినిమాతో టాలీవుడ్‌లో రీ ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాలో పూజా ఆరబోసిన అందాలకు అభిమానులు ఫిదా అయ్యారు.

ఆ తర్వాత రామ్ చరణ్ హీరోగా నటించిన ‘రంగస్థలం’లో జిగేలు రాణిగా మెరుపులు మెరిపించింది. ఇక త్రివిక్రమ్ దర్శకత్వంతో ఎన్టీఆర్ సరసన చేసిన ‘అరవింద సమేత వీరరాఘవ’ మహేష్ బాబు హీరోగా నటించిన ‘మహర్షి’ మూవీతో ఈ భామ క్రేజ్ అమాంతం పెరిగింది. అల్లు అర్జున్ హీరోగా నటించిన అల వైకుంఠపురం ఇలా తెలుగులో బ్యాక్‌టు బ్యాక్‌ హిట్స్‌తో టాప్‌ రేసులో చోటు దక్కించుకుంది. ఇప్పటివరకు సినిమాకు రూ. 1.5 కోట్లు తీసుకున్న పూజా ఏకంగా కోటి పెంచి రూ. 2.5 కోట్లు డిమాండ్ చేస్తుందట.

Read more RELATED
Recommended to you

Exit mobile version