డాక్టర్ కిడ్నాప్ కేసు : సంచలన అంశాలు బయట పెట్టిన సజ్జనార్

-

డాక్టర్ హుస్సేన్ కిడ్నాప్ కు గురయ్యాడని తెలిసిన వెంటనే 12 టీమ్ ల ఏర్పాటు చేశామని సీపీ సజ్జనార్ అన్నారు. మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, కర్నాటక, తెలంగాణాలో సెర్చ్ కు పంపించామన్న ఆయన కర్నాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ పోలీసులు కిడ్నాప్ కేసు నిందితులను పట్టుకునేందుకు బాగా సహకరించారని అన్నారు. కిడ్నాప్ తో పాటు రాష్ట్రం దాటించేందుకు రెండు మూఠాలకు ముస్తఫా సుపారీ ఇచ్చాడని అన్నారు.

హుస్సేన్ భార్యకు ముస్తఫా దగ్గరి బంధువని, ఆస్ట్రేలియాలో ముస్తఫా ఆర్థికంగా దెబ్బతిని పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయాడని అయన అన్నారు. ఈ క్రమంలో హైదరాబాద్, పూణెలో రియల్ ఎస్టేట్ వ్యాపారం ప్రారంభించాడని, ఇతనికి ముబాషిర్ అహ్మద్ పార్టనర్ గా కలిశాడని ఈ ఇద్దరూ విలాసవంతమైన జీవితానికి అలవాటు అయ్యారని అన్నాడు. ఇందులో భాగంగా ఎవరైనా బాగా డబ్బు ఉన్న వ్యక్తి నుంచి కిడ్నాప్ చేయాలనుకున్నారని అందులో భాగంగా డాక్టర్ హుస్సేన్ ను ఎంచుకున్నారని సజ్జనార్ అన్నారు.

నెమ్మదిగా డాక్టర్ హుస్సేన్ తో పరిచయం పెంచుకుని డాక్టర్ హుస్సేన్ క్లీనిక్ మీద ముస్తఫా ఫ్లాట్ ను అద్దెకు తీసుకున్నాడని అన్నారు. అక్కడ అతని పై నిఘా పెట్టడానికి తనకు చెందిన వ్యక్తులను అక్కడ ఉంచాడని అన్నారు. ప్లాన్ లో భాగంగా నిన్న మధ్యాహ్నం లైటర్ తుపాకీతో బెదిరించి డాక్టర్ కు చెందిన కారులోనే కిడ్నాప్ చేశారని అన్నారు. కిడ్నాప్ ఒక టీమ్ చేస్తే మరో టీమ్ డాక్టర్ ను కర్ణాటక కు తీసుకెళ్ళాలని ప్లాన్ చేయగా ఒక చిన్న క్లూతో కిడ్నాప్ కు సంబంధించిన నిందితుల సమాచారం అందిందని అన్నారు. ముస్తఫా, ఖలీద్ లు ఇద్దరు ఫైనాన్షియల్ సలహాదారులుగా పని చేస్తున్నారని అందు కోసమే బిట్ కాయిన్ రూపంలో డబ్బులు డిమాండ్ చేశారని అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version