పోస్టాఫీస్: ఆగస్ట్ 1 నుంచి కొత్త రూల్స్..!

-

పోస్టాఫీస్(Post Office) బ్యాంక్‌లో అకౌంట్ వుందా..? అయితే మీరు తప్పకుండ ఈ విషయాలని తెలుసుకోవాలి. పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ ఖాతాదారులకు కొత్త రూల్స్ రాబోతున్నాయి. ఇక వీటి కోసం పూర్తి వివరాలలోకి వెళితే..

పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ ఖాతాదారులకు కొత్త రూల్స్ అమలులోకి రాబోతున్నాయి. ఈ రూల్స్ ఆగస్ట్ 1 నుంచి ఖసీసీతంగా అమలులోకి వస్తున్నట్టు తెలుస్తోంది. అయితే ఈ కొత్త విధానం వలన చాలా మందిపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

ఇక ఆ రూల్స్ గురించి చూస్తే.. ఐపీపీబీ కస్టమర్లు ఆగస్ట్ 1 నుంచి డోర్ స్టెప్ బ్యాంకింగ్ సేవలకు చార్జీలు చెల్లించుకోవాల్సి ఉంటుంది అని తెలుస్తోంది. అయితే ఇప్పుడైతే ఈ డోర్‌ స్టెప్ బ్యాంకింగ్ సేవలపై డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదు. కానీ ఒకటో తేదీ నుంచి మాత్రం రూ.20 చెల్లించుకోవాలి అని తెలుస్తోంది.

ఇది ఇలా ఉంటే ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్‌లో ఖాతా కలిగిన వారికి గతంలో 2.75 శాతం వడ్డీ వచ్చేది. కానీ ఇప్పుడు ఆ వడ్డీ రేట్లలో కూడా మార్పు వచ్చింది. ఇప్పుడు 2.5 శాతం వడ్డీ మాత్రమే వస్తోంది. ఇది కూడా కాస్త ప్రభావం చూపిస్తుంది.

మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే ఐపీపీబీ యాప్ చాలా సులభంగా వాడచ్చు. పోస్టాఫీస్‌ ఖాతాదారులు వారి బ్యాంక్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవడానికి, మనీ ట్రాన్స్‌ఫర్ సర్వీసులను, ఇతర ఆర్థిక సేవలను ఐపీపీబీ యాప్ ద్వారా పొందొచ్చు. ఇంట్లో వుండే యాప్ ద్వారా ఈ సర్వీసులని పొందొచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news