పోస్ట్ ఆఫీస్ లో అకౌంట్ వుందా..? అయితే ఈ కొత్త సర్వీస్ ని చూడాల్సిందే..!

-

పోస్ట్ ఆఫీస్ ఎన్నో రకాల సేవలను అందిస్తోంది. ఈ స్కీమ్స్ ద్వారా చక్కటి ప్రయోజనాన్ని పొందొచ్చు. పైగా పోస్ట్ ఆఫీస్ అందించే సేవల వలన చాలా లాభాలు కూడా వున్నాయి. పోస్ట్ ఆఫీస్ స్కీములకి ఇ-పాస్‌బుక్ సదుపాయాన్ని ప్రారంభిస్తున్నామని కూడా కేంద్ర సమాచార సహాయ మంత్రి దేవ్‌సిన్హ్ చౌహాన్ చెప్పారు. ఇక పూర్తి వివరాలను చూస్తే..

ఇ-పాస్‌బుక్ సదుపాయాన్ని ప్రారంభించడంతో స్కీమ్స్ డిజిటలైజ్ అవుతున్నాయి. ఈ ఫెసిలిటీ ద్వారా ఎప్పుడైనా సరే ట్రాన్సాక్షన్స్ యొక్క హిస్టరీని తెలుసుకోవచ్చు. ఇది వరకైతే మినీ స్టేట్‌మెంట్ మాత్రమే కనపడేది. కానీ అలా కాకుండా ఇప్పుడు ఎప్పుడైనా సరే ట్రాన్సాక్షన్స్ యొక్క హిస్టరీని తెలుసుకోవచ్చు. ఇ-పాస్‌బుక్ ఫెసిలిటీ ఉచితం. ఎలాంటి రుసుము చెల్లించక్కర్లేదు.

సేవింగ్స్ ఖాతాదారులు స్వయంగా అకౌంట్ స్టేట్‌మెంట్‌ను చెక్ చెయ్యడానికి అవుతుంది. ఇక మరి ఈ సదుపాయాన్ని ఎలా ఉపయోగించుకోవచ్చు అనేది చూద్దాం.

దీని కోసం మొదట మీరు పోస్ట్ ఆఫీస్ యాప్ ఓపెన్ చేయండి.
ఇప్పుడు మీరు మీ వివరాలను ఇవ్వండి.
లాగిన్ అయ్యాక మొబైల్ బ్యాంకింగ్ ఓపెన్ చేయండి.
మీకిప్పుడు పోస్ట్ ఆఫీస్ అకౌంట్ డ్యాష్‌బోర్డ్ కనిపిస్తుంది.
ఇక్కడ మీరు చెక్ బ్యాలెన్స్, స్టేట్‌మెంట్ ఆప్షన్స్ ఉంటాయి.
స్టేట్‌మెంట్ పైన క్లిక్ చేస్తే మినీ స్టేట్‌మెంట్ అంతా కూడా వస్తుంది.
అకౌంట్ స్టేట్‌మెంట్ ఆప్షన్ మీద నొక్కితే ఎప్పటివరకు స్టేట్‌మెంట్ కావాలో ఆయా తేదీలను ఎంటర్ చేయాలి.
అంతే స్టేట్‌మెంట్ డౌన్‌లోడ్ అవుతుంది.
కావాలంటే మీరు www.indiapost.gov.in లేదా www.ippbonline.com వెబ్‌సైట్లలో కూడా ఇ-పాస్‌బుక్ డౌన్‌లోడ్ చేయొచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version