పోస్టాఫీస్(post office) ఎన్నో రకాల స్కీమ్స్ ని అందిస్తోంది. ఈ స్కీమ్స్ వలన చాలా లాభాలు కలుగుతాయి. పైగా ఏ రిస్క్ కూడా ఉండదు. కచ్చితమైన రాబడి పొందొచ్చు. చాలా మంది పోస్టాఫీస్ స్మాల్ సేవింగ్ స్కీమ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తూ వుంటారు. పైగా ఎన్నో స్కీమ్స్ కూడా వున్నాయి. వీటిల్లో సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ కూడా ఒకటి. ఇక ఈ స్కీమ్ కోసం పూర్తిగా చూస్తే..
పోస్టాఫీస్ అందిస్తున్న సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ వలన అదిరిపోయే లాభాలు కలుగుతాయి. అయితే ఈ స్కీమ్ లో కేవలం సీనియర్ సిటిజన్స్ మాత్రమే చేరడానికి అవుతుంది. ఇలా సీనియర్ సిటిజన్స్ ఈ స్కీమ్ లో డబ్బులు పెట్టి దీని ద్వారా డబ్బులు పెట్టొచ్చు.
ప్రస్తుతం సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్‌పై 7.4 శాతం వడ్డీ లభిస్తోంది. మీరు రూ.1000తో కూడా ఈ స్కీమ్‌లో ఖాతా తెరవొచ్చు. కావాలంటే ఈ స్కీమ్ మెచ్యూరిటీ కాలాన్ని 3 ఏళ్లు పొడిగించుకోవచ్చు. గరిష్టంగా రూ.15 లక్షల వరకు డబ్బులు ఇన్వెస్ట్ చేయొచ్చు. ఈ స్కీమ్ మెచ్యూరిటీ కాలం 5 ఏళ్లు.
ఈ స్కీమ్ ఇన్వెస్ట్ చెయ్యడం వలన ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80సీ కింద ట్యాక్స్ బెనిఫిట్స్ కూడా పొందొచ్చు. ఒకేసారి రూ.10 లక్షలు ఈ స్కీమ్‌లో ఇన్వెస్ట్ చేస్తే.. ఐదేళ్లలో మీకు రూ.14 లక్షలకు పైగా వస్తాయి. అలానే వడ్డీ రూపంలో రూ.4,28,964 వరకు పొందొచ్చు. ఇలా ఈ స్కీమ్ తో సీనియర్ సిటిజెన్స్ చక్కటి లాభలు పొందొచ్చు.