నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఇంజనీరింగ్ అర్హతతో నేవీలో ఉద్యోగాలు..!

-

ఉద్యోగం కోసం చూస్తున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. పలు ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ఇండియన్ నేవీ ప్రకటించింది. అర్హత, ఆసక్తి వున్నవాళ్లు ఈ జాబ్ కోసం అప్లై చేసుకోవచ్చు. ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాల లోకి వెళితే..ఇండియన్ నేవీ పలు ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు తెలుస్తోంది.

 

నేవీ/ Navy
నేవీ/ Navy

ఈ మేరకు నోటిఫికేషన్ ని విడుదల చేయడం జరిగింది. ఎంపికైన అభ్యర్థులకు ముందుగా శిక్షణ ఇస్తారు. ఈ ఉద్యోగాలకు దరఖాస్తుల ప్రక్రియ ఈ నెల 16 నుంచి ప్రారంభం కానుంది. దరఖాస్తులకు ఈ నెల 30ని ఆఖరి తేదీగా నిర్ణయించారు.

ఎలక్ట్రికల్ విభాగంలో షార్ట్ సర్వీస్ కమిషన్ (ఎస్ఎస్సీ) అధికారుల ఉద్యోగాలకు దరఖాస్తు చేస్తున్నారు. ఇక పోస్టుల గురించి చూస్తే.. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 50 ఖాళీలను భర్తీ చేయనున్నారు. జనరల్‌ సర్వీస్‌ (జీఎస్‌)-ఎస్‌ఎస్‌సీ ఎలక్ట్రికల్‌ బ్రాంచ్‌ లో ఈ ఖాళీలు ఉన్నాయి.

ఇది ఇలా ఉంటే అభ్యర్థులు కనీసం 60 శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టుల్లో BE/BTech ఉత్తీర్ణత సాధించి ఉండాలి గమనించండి. ఇక వయస్సు గురించి చూస్తే.. అభ్యర్థులు జనవరి 2, 1997 నుంచి జులై 1, 2002 మధ్యలో జన్మించి ఉండాలి.

అంతే కాకుండా నోటిఫికేషన్లో సూచించిన శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి. కేవలం అవివాహితులైన పురుషులు మాత్రమే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలి. కరోనా పరిస్థితుల నేపథ్యంలో అకాడమిక్‌ మెరిట్‌ ఆధారంగా అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేయనున్నారు. షార్ట్ లిస్ట్ చేసిన అభ్యర్థులకు ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేయనున్నారు.

అలానే ఎంపికైన అభ్యర్థులకు కేరళ రాష్ట్రంలోని ఇండియన్‌ నేషనల్‌ అకాడమీ, ఎజిమళలో శిక్షణ ఇవ్వనున్నారు. పూర్తి వివరాలని నోటిఫికేషన్ లో చూడండి. https://www.joinindiannavy.gov.in/en

 

Read more RELATED
Recommended to you

Latest news