మీ పాన్ కార్డు నిజమైనదో కాదో ఇలా చెక్ చెయ్యండి..!

-

పాన్ కార్డు మనకి ఎంతో కీలకమైన డాక్యుమెంట్లలో ఒకటి. దీని వలన మనకి ఎన్నో ఉపయోగాలు కలుగుతాయి. ప్రతి ఒక్కరూ పాన్ కార్డు కలిగి ఉండటం ఎంతో మంచిది. అయితే ఆదాయపు పన్ను శాఖ పాన్ కార్డులను ఇస్తుంది అన్న సంగతి తెలిసిందే. లేదా ఆన్ లైన్ లో పాన్ కార్డు కోసం అప్లై చెయ్యచ్చు.

ఇది ఇలా ఉంటే పాన్ కార్డు ఎంతో ఈజీగా పొందొచ్చు. ఇపాన్ కార్డును నిమిషాల్లో తీసుకోవచ్చు. చాలా మంది అదే చేస్తున్నారు. అయితే ఎన్ఎస్‌డీఎల్, యూటీఐఐటీఎస్ఎల్ వెబ్‌సైట్ల ద్వారా పాన్ కార్డు కోసం అప్లై చేయొచ్చు. అయితే పాన్ కార్డు ఇంటికి రావాలంటే కనీసం ఆరు నుండి ఏడు రోజులు పడుతుంది.

పాన్ కార్డు కలిగిన వారు మాత్రం ఖచ్చితంగా ఈ విషయాలని తెలుసుకోవాలి. అదేమిటంటే పాన్ కార్డ్స్ లో నకిలీవి కూడా ఉంటాయి. వీటిని తప్పక గమనించాలి. ఫేక్ పాన్ కార్డుల గురించి కనిపెడితే ఫ్రాడ్స్ ని అప్పచ్చు.

ఎంతో మంది మోసగాళ్లు ఫేక్ పాన్ కార్డుల ద్వారా మోసాలకు పాల్పడుతుంటారు. కనుక ఈ విషయం కూడా తెలుసుకోవాలి. ఫేక్ పాన్ కార్డ్స్ కి రీయల్ పాన్ కార్డ్స్ ని ఎలా గుర్తించాలి అనేది చూస్తే.. మీరు ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్‌కు వెళ్లాలి.

అక్కడ వెరిఫై పాన్ అనే ఆప్షన్ ఉంటుంది. దీనిపై క్లిక్ చేసి పాన్ నెంబర్, పేరు, పుట్టిన తేదీ, మొబైల్ నెంబర్ ఎంటర్ చెయ్యాలి. ఆ పాన్ నెంబర్ మనుగడలో ఉందో లేదో తెలిసిపోతుంది. ఇలా ఫేక్ పాన్ ని రీయల్ కార్డుని గుర్తించచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news