ఖాళీ అయిపోయిన కూల్ డ్రింక్ బాటిల్ లో నీళ్లు పోసి ఫ్రిడ్జ్ లో పెడుతున్నారా..? అయితే ఈ సమస్యలు తప్పవు..!

-

సాధారణంగా చాలా మంది ఖాళీ అయిపోయిన కూల్ డ్రింక్ బాటిల్స్ లో వాటర్ పోసి ఫ్రిజ్లో పెడుతూ ఉంటారు. మీరు కూడా చల్లటి నీళ్ల కోసం ఖాళీ అయిపోయిన వాటర్ బాటిల్స్ ని కానీ కూల్ డ్రింక్ బాటిల్స్ ని కానీ కడిగేసి నీళ్ళతో నింపి ఫ్రిజ్లో పెడుతున్నారా..? అయితే మీరు తప్పక దీని కోసం తెలుసుకోవాలి. నిజానికి ప్లాస్టిక్ బాటిల్స్ వల్ల ఆరోగ్యానికి ముప్పు కలుగుతుంది.

 

అందుకని ఈ తప్పులు చేయకూడదు అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే మరి ఖాళీ అయిపోయిన వాటర్ బాటిల్స్ లో లేదా కూల్ డ్రింక్ బాటిల్స్ లో నీళ్లు పోసి ఫ్రిజ్ లో పెట్టి ఆ నీటిని తాగడం వల్ల ఎలాంటి సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది అనే దాని గురించి చూద్దాం.

మినరల్ వాటర్ బాటిల్స్ లేదా కూల్ డ్రింక్ బాటిల్స్ లో నీళ్లు పోసి ఎక్కువ రోజులు అలా రిపీట్ చేయడం వల్ల ఆరోగ్యానికి హాని కలుగుతుంది. ఇలా చేయడం ఫ్లోరైడ్ మరియు ఆర్సెనిక్ అందులో ఫామ్ అవుతుంది. నిజానికి ఇవి ఆరోగ్యానికి హానికరం. సైంటిస్టులు దీనివల్ల స్లో పాయిజన్ అవుతుందని అంటున్నారు. అలానే ఇతర సమస్యలు కూడా కలుగుతాయి. మరి వాటి కోసం కూడా చూసేయండి.

క్యాన్సర్ రిస్క్:

చాలా రిపోర్టు ప్రకారం చూసుకున్నట్లయితే ప్లాస్టిక్ బాటిల్ లో నీళ్లు తాగడం వల్ల రోగనిరోధక శక్తి పై ఎఫెక్ట్ పడుతుంది. అలాగే లివర్ క్యాన్సర్ వంటివి కెమికల్స్ కారణంగా వస్తాయి.

ఊబకాయం, డయాబెటిస్:

ఎక్కువ కాలం పాటు ప్లాస్టిక్ బాటిల్స్ ని ఉపయోగించడం వల్ల బీపీఏ ని ప్రొడ్యూస్ చేస్తుంది. బీపీఏ అన్నది ఒక కెమికల్ దీని వల్ల ఊబకాయం డయాబెటిస్ మొదలైన సమస్యలు కలుగుతాయి కాబట్టి వీలైనంత వరకు ఈ తప్పులు చేయకుండా ఉండండి. దీనితో ఆరోగ్యం బాగుంటుంది లేదంటే లేనిపోని సమస్యల్ని కొని తెచ్చుకున్నట్లే.

Read more RELATED
Recommended to you

Exit mobile version