ఈ స్కీమ్ లో డబ్బులు పెడితే.. ట్యాక్స్ కట్టకుండానే లక్షలని పొందొచ్చు…!

-

ఈ మధ్య కాలం లో ప్రతీ ఒక్కరు వారికి నచ్చిన స్కీమ్స్ లో డబ్బులని పెడుతున్నారు. ఇలా నచ్చిన స్కీమ్స్ లో డబ్బులని పెడితే మంచిగా లాభాలని పొందొచ్చు. అలానే భవిష్యత్తు లో ఏ ఇబ్బంది కూడా ఉండదు. మీరు కూడా ఏదైనా మంచి స్కీమ్స్ కోసం చూస్తున్నారా..? అయితే ఈ స్కీమ్ గురించి తప్పక చూడండి. పీపీఎఫ్ తో చక్కటి లాభాలని పొందొచ్చు. ఎలాంటి రిస్క్ కూడా ఉండదు.

పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ తో సూపర్ బెనిఫిట్స్ ని చాలా మంది పొందుతున్నారు. 2022-23 ఆర్థిక సంవత్సరం ముగియడానికి ఎక్కువ టైం లేదు. ఈ ఆర్థిక సంవత్సరానికి ఆదాయపు పన్ను మినహాయింపు పొందడానికి మార్చి 31 లోపు కొన్ని పథకాలలో పెట్టుబడి పెడితే పన్ను ఆదా తో పాటు 7.1% వార్షిక వడ్డీ లభిస్తుంది. ఈ స్కీమ్ పై ప్రస్తుతం 7.1% వార్షిక వడ్డీ వస్తోంది.

దానితో మీరు డబ్బులని వెనకేయ్యచ్చు. ఇది EEE వర్గం కిందకు వస్తుంది. దానికి అర్ధం ఏమిటంటే మీరు పథకంలో చేసిన మొత్తం పెట్టుబడి పై పన్ను మినహాయింపు ని పొందొచ్చు. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80సి కింద ఏడాదికి రూ.1.5 లక్షల దాకా ట్యాక్స్ బెనిఫిట్స్ ని పొందేందుకు అవుతుంది. అలానే పెట్టుబడి నుంచి పొందిన వడ్డీ, మెచ్యూరిటీ పై పొందిన మొత్తంపై ఎటువంటి ట్యాక్స్ కూడా పే చేయాల్సిన పని లేదు. ఇలా ఈ స్కీమ్ తో అదిరే బెనిఫిట్స్ ని పొందొచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version