పవన్ కళ్యాణ్ కోసం త్యాగానికి సిద్ధం: ప్రభాకర్ చౌదరి

-

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కోసం తన సీటు త్యాగం చేయడానికి సిద్ధం అన్నారు తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి అనంతపురంలో మీడియాతో మాట్లాడుతూ పవన్ విషయంలో గతంలో చెప్పిన మాటకి కట్టుబడి ఉన్నానన్నారు. తెలుగుదేశం జనసేన పొత్తులో భాగంగా పవన్ కళ్యాణ్ అనంతపురంలో పోటీ చేస్తానంటే స్వాగతిస్తానని స్పష్టం చేశారు. గెలుపు కోసం నా భుజస్కందాలపై వేసుకొని పవన్ కళ్యాణ్ గారిని గెలిపించడానికి సిద్ధంగా ఉన్నాను అన్నారు.

ఈ విషయంపై నేను పార్టీ శ్రేణున్ని నచ్చచెప్పి పవన్ కళ్యాణ్ ని గెలిపిస్తానని అన్నారు ప్రభాకర్ చౌదరి. టిడిపి జనసేన పొత్తుతో ఎన్నికలకి వెళ్లేందుకు సిద్ధమవుతుండగా సీట్ల వ్యవహారం మీద చర్చలు సాగుతున్నాయి. కొన్ని సీట్లు మీద ఒక నిర్ణయానికి వచ్చినా మరోవైపు బిజెపి పొత్తు వ్యవహారం తెల్తే క్లారిటీ వస్తుంది అని అంటున్నారు. ఇదే టైంలో అనంతపురం అర్బన్ నుండి బరిలోకి దిగేది ఏ పార్టీ టీడీపీడా జనసేనకా అనే ఉత్కంఠ కొనసాగుతోంది పవన్ కళ్యాణ్ కనుక పోటీ చేస్తే అనంతపురం అర్బన్ నుండి నేను తప్పుకుంటానన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news