హరీశ్ రావుకు సపోర్టు చేస్తాం.. కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు..!

-

తెలంగాణ మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు పై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ మీడియా చిట్ చాట్ లో మంత్రి కోమటిరెడ్డి హరీశ్ రావునుద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నిన్నటి హరీశ్ రావు వ్యాఖ్యలు కేసీఆర్ కి వెన్నుపోటు పొడిచే విధంగా ఉన్నాయన్నారు. కేసీఆర్ ని వ్యతిరేకించి వస్తే.. సపోర్టు చేస్తాం అన్నారు.  కర్ర పట్టుకొని తిరుగుతున్న కేసీఆర్ పులి ఎట్లా అవుతారని ప్రశ్నించారు.

సీఎం అయ్యే ప్లాన్ లో హరీశ్ ఉన్నట్టున్నాడు అని పేర్కొన్నారు. కేసీఆర్ ని వ్యతిరేకించి వస్తే అందుకు సపోర్టు చేస్తామన్నారు. బీఆర్ఎస్ పార్టీ హరీశ్ రావు, కవిత, కేటీఆర్ పేర్ల మీద విడిపోతుంది. అప్పుడు నాలు పార్టీలు అవుతాయని సెటైర్లు వేశారు. హరీశ్ రావు పార్టీలో ఉంటే సీఎం కాలేడు.. బీఆర్ఎస్ ఎల్పీ లీడర్ కూడా కాలేడన్నారు. ఆయన 20 మందితో ఆ పార్టీ లీడర్ కావాలన్నారు. 60కిలోలు ఉన్న వ్యక్తి పులి అయితే.. 86 కిలోలు ఉన్న నేనేం కావాలన్నారు. ఇంకో 20 ఏళ్లు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుందని జోస్యం చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news