నిరాశలో ప్రభాస్ ఫ్యాన్స్.. ఎందుకో తెలుసా..?

-

టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ నిరాశలో ఉండటం ఏంటి.. ప్రస్తుతం ప్రభాస్ వరుస సినిమాలకు సంబంధించి అప్డేట్లు వస్తుండడంతో పండగ చేసుకుంటున్నారు కదా అని అంటారా. ప్రస్తుతం రెబల్ స్టార్ ప్రభాస్ రాధేశ్యామ్ అనే సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో మొదటిసారి పూజా హెగ్డే తో రొమాన్స్ చేయబోతున్నాడు రెబల్ స్టార్ ప్రభాస్. ఈ సినిమా పూర్తవక ముందే ఇటీవలే ఆది పురుష్ అనే భారీ బడ్జెట్ సినిమాని కూడా ప్రకటించాడు.

అయితే టైటిల్ డిఫరెంట్ గా ఉండడంతో ఎంతోమంది లో ఆసక్తిని కలిగించింది ఈ సినిమా. అయితే ఆది పురుష్ సినిమా రామాయణం అని.. ఇందులో రెబల్ స్టార్ ప్రభాస్ రాముడి పాత్రలో కనిపించబోతున్నాడని రావణాసురుడు పాత్రలో బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్ నటించబోతున్నారు అంటూ గత కొన్ని రోజులుగా టాక్ వినిపించింది. దీంతో ప్రభాస్ ను రాముడి పాత్రలో చూసేందుకు సిద్ధమైన అభిమానులు ఫుల్ ఖుషీ అయ్యారు. కానీ ప్రస్తుతం ఆదిపురుష్ స్టోరీ రామాయణం కాదని… టాక్ వినిపించడం తో ప్రభాస్ అభిమానులు నిరాశ లో మునిగిపోయారు.

Read more RELATED
Recommended to you

Latest news