ఈ షర్ట్ వేసుకుంటే కరోనా దరి చేరదు..!

-

ఈ కరోనా పీడ దినాల్లో పూర్తి ఆరోగ్యంతో కనిపిస్తున్న వ్యక్తులతో కలసి తిరిగినా.. ప్రమాదమే. ఎందుకంటే వారికి కరోనా వైరస్ సోకిందో లేదో తెలుసుకోవడం అసాధ్యం. మొన్నటి వరకు గాలి ద్వారా కరోనా ప్రబలుతుందన్న ప్రచారం జరగగా… ప్రస్తుతం మనం ధరించే దుస్తులు ద్వారా కూడా కరోనా వైరస్ సంక్రమించే ప్రమాదం ఉందని జోరుగా ప్రచారం జరుగుతోంది.

ఐతే ఈ నేపథ్యంలో దుస్తుల ద్వారా జరిగే కరోనా వ్యాప్తిని అరికట్టే ‘యాంటీ వైరల్‌’ దుస్తులును రూపొందించగా.. అవి త్వరలోనే మార్కెట్లోకి విడుదల కానున్నాయని తెలుస్తోంది. అహ్మదాబాద్‌లోని ‘నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ డిజైన్‌’ (ఎన్‌ఐడి) మాజీ ప్రొఫెసర్‌, ‘క్రాఫ్ట్స్‌ విలేజ్‌ అండ్‌ ఇండియా క్రాఫ్ట్‌ వీక్‌’ సహ వ్యవస్థాపకుడైన సోమేశ్‌ సింగ్‌ కరోనా మహమ్మారి నుంచి కాపాడుకునేందుకు యాంటి వైరల్ దుస్తులను రూపొందించారు. ఐతే దుస్తుల ద్వారా సోకే కరోనా వ్యాప్తికి అడ్డుకట్టవేసేందుకు సోమేశ్‌ సింగ్‌ కోవెస్ట్‌ జాకెట్‌ ను రూపొందించారు. ఈ జాకెట్ కు శరీర ఉష్ణోగ్రతకు సంబంధించిన డిస్‌ప్లే ఉంటుంది.

ఈ జాకెట్‌ను ధరించిన వ్యక్తులకు ఎస్‌డీ ప్లస్‌ సెన్సర్‌ టెక్నాలజీ రెండు మీటర్ల దూరంలో ఉన్న కరోనా పీడితులను కూడా గుర్తించి అప్రమత్తం చేస్తుంది. దీనికున్న జేబులు ఫోన్‌, వాచీ, రింగులు తదితర వస్తువులను కూడా శానిటైజ్‌ చేసి కరోనా వైరస్ సంక్రమించే అవకాశాలు పూర్తిగా తగ్గిస్తాయి. ఈ కోవెస్ట్‌ రూపకల్పనలో ఎన్‌9 ఎక్స్‌టీఎస్‌-18 అనే స్విస్‌ టెక్నాలజీని ఉపయోగించగా… దుస్తుల పైభాగం శానిటైజర్లు ఇవ్వబడ్డాయి. సో, దీనిని ధరిస్తే వైరస్‌, బ్యాక్టీరియాల గట్రా మన దరికి చేరవు. అంతేకాదు ఈ జాకెట్ లో చక్కని సువాసన వెదజల్లే అరోమాథెరపీ కూడా ఇవ్వబడింది. ఇంకా జాకెట్‌ కాలర్‌లో ఫేస్‌మాస్క్‌ కూడా ఉంటుందని ఎన్‌ఐడి సంస్థ చెబుతోంది.

ఇకపోతే సెప్టెంబర్ నెల లోపు ఈ జాకెట్ రిటైల్‌ మార్కెట్లోకి విడుదల కాబోతోంది. క్యాజువల్‌, ఫార్మల్‌, ఎథ్నిక్‌ ఇలా మూడు వేరియంట్లలో లభించే దీని ధర దాదాపు రూ.5 వేలు ఉండొచ్చని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news