‘ జాన్ ‘ మూవీ స్టోరీ ఇదే.. రివీల్ చేసిన ప్ర‌భాస్‌

-

యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ సుజిత్ ద‌ర్శ‌క‌త్వంలో యువి క్రియేష‌న్స్ సంస్థ దాదాపు రూ. 350 కోట్ల భారీ బ‌డ్జెట్‌తో `సాహో` చిత్రాన్ని  తెర‌కెక్కించ‌బోతుంది. ప్ర‌పంచ వ్యాప్తంగా రేపు తెలుగుతో పాటు హిందీ, త‌మిళ్‌, మ‌ళ‌యాల భాష‌ల్లో ఒకేసారి విడుద‌ల కాబోతుంది. భారీ యాక్ష‌న్ థిల్ల‌ర్‌గా రాబోతున్న ఈ చిత్రంపై అంచ‌నాలు త‌రా స్థాయిలో నెల‌కొన్నాయి. బాహుబలి సిరీస్ త‌ర్వాత‌ ప్రభాస్ చేస్తోన్న సినిమా కావడంతో బాలీవుడ్ ప్రియుల‌ను కూడా ఆక‌ర్షిస్తోంది. ఇక తాజా స‌మాచారం ప్ర‌కారం సాహో త‌ర్వాత చేయ‌బోయే నెక్ట్స్ మూవీ స్టోరీ లీక్ అయింది.

సాహో రిలీజ్ టైం ద‌గ్గ‌ర ప‌డుతోంది. ఈ క్ర‌మంలోనే ప్రభాస్ ప్రచార కార్యక్రమాలలో బిజీబిజీగా పాల్గొంటున్నారు. మ‌రియు తెలుగు ఛాన‌ళ్ల‌కు అందుబాటు ఉంటున్నారు. ఇక‌ తాజాగా ఓ టీవీ జ‌రిపిన ఇంటర్వ్యూ లో ప్ర‌భాస్ పాల్గొన్నాడు. అయితే ఈ ఇంటర్వ్యూలో ప్ర‌భాస్‌ను కొంద‌రు మీ నెక్ట్స్ మూవీ ఓ ల‌వ్ స్టోరీ అంట క‌దా అని అడ‌గ‌గా.. దానికి ప్ర‌భాస్ అవును! 1960 ల నాటి యూరప్ నేపథ్యంలో నడిచే విభిన్నమైన, విచిత్ర‌మైన‌ ప్రేమ కథ అంటూ బ‌దులిచ్చారు.

జిల్ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో ప్ర‌భాస్ నెక్ట్స్ మూవీ వ‌చ్చే ఏడాది విడుద‌ల కానుంది. పాన్ ఇండియా మూవీగా తెర‌కెక్క‌బోయే ఈ సినిమాకు జాన్ టైటిల్ దాదాపు ఖ‌రారైన‌ట్టుగా తెలుస్తోంది. ఈ సినిమా సాహో అంత భారీ బ‌డ్జెడ్‌తో తెర‌కెక్క‌క‌పోయినా రూ.120-150 కోట్ల వ‌ర‌కు ఖ‌ర్చు చేస్తున్న‌ట్టుగా చెపుతున్నారు. జాన్ లైన్‌ ఇప్ప‌టి వ‌ర‌కు భారత చిత్రాలలో ఎవ‌రు చూడ‌ని ల‌వ్ స్టోరిగా ఉంటుంద‌ని ప్ర‌భాస్ చెప్పాడు.

జాన్‌పై ప్ర‌భాస్ మాట‌ల‌ను బ‌ట్టి చూస్తే ఇది  పీరియాడిక్ లవ్ స్టోరీగా ఉంటుంద‌ని అర్థం అవుతుంది. ఇక సాహో మ‌రి కొన్ని గంట‌ల్లో ప్రీమియ‌ర్ షోలు కూడా మొద‌ల‌వ‌బోతున్నాయి. ఇక ప్ర‌భాస్ సాహో చిత్రం త‌ర్వాత రాబోయే పీరియాడిక్ ల‌వ్ స్టోరి ఎలా ఉండ‌బోతుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news