ఆ రోజునే ప్రభాస్ ‘కల్కి’ మూవీ విడుదల ?

-

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తోన్న సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ ‘కల్కి 2898 AD’. ఈ చిత్రానికి మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నాడు.కల్కి షూటింగ్ శరవేగంగా సాగుతోంది.కాగా ఈ చిత్రం లో అమితాబ్‌, కమల్‌హాసన్‌, దీపిక పదుకొణే, దిశా పటానీ ప్ర‌ధాన పాత్ర‌లు పోషిస్తున్నారు.ఇప్ప‌టికే ఈ చిత్రం నుంచి విడుదల అయిన పోస్ట‌ర్స్, గ్లింప్స్‌ల‌కు మంచి స్పందన వ‌చ్చింది.

ఇదిలా ఉంటే… ఈ చిత్రం విడుదల వాయిదా పడినట్లు తెలుస్తోంది. మేకర్స్ ముందుగా ప్రకటించినట్లు మే 9వ తేదీన రిలీజ్ కావట్లేదని, జూన్ 20వ తేదీకి మారినట్లు సినీవర్గాలు వెల్లడించాయి.నిన్నటి వరకూ మే 30వ తేదీన ‘కల్కి’ వస్తుందని వార్తలొచ్చాయి. కానీ, లోక్సభ ఎన్నికల హడావిడి పూర్తయ్యాకే రిలీజ్ చేయాలని భావిస్తున్నారట.కాగా, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా పార్లమెంట్ ఎన్నికలతో పాటు ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేసిన సంగతి తెలిసిందే.ఏప్రిల్ 19వ తేదీ నుంచి పోలింగ్ ప్రారంభమవుతుండగ,జూన్ 04న ఎన్నికల కౌంటింగ్ చేపట్టనున్నట్టు సీఈసీ రాజీవ్ కుమార్ వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news