BJP candidate kisses woman in Bengal : బీజేపీ ఎంపీ అభ్యర్థి యువతికి ముద్దు పెట్టాడు. ఈ సంఘటన పశ్చిమ బెంగాల్‌లో చోటు చేసుకుంది ఈ సంఘటన ఇప్పుడు వైరల్ గా మారింది. పశ్చిమ బెంగాల్‌లో మాల్దా బీజేపీ ఎంపీ అభ్యర్థి ఖగేన్ ముర్ము ఇంటింటి ప్రచారం నిర్వహిస్తుండగా ఓ ఇంటి ముందు కనిపించిన యువతి బుగ్గపై ముద్దు పెట్టాడు.

బిజెపి ఎంపి ఖగెన్ ముర్ము బెంగాల్‌లోని ఉత్తర మాల్దా నియోజకవర్గం నుంచి ప్రచారం చేస్తున్నప్పుడు ఒక మహిళ చెంపపై ముద్దు పెట్టుకోవడం వివాదానికి దారితీసింది. బీజేపీ అభ్యర్థి తన పార్లమెంటరీ నియోజకవర్గంలోని చంచల్‌లోని శ్రీహిపూర్ గ్రామంలో సోమవారం ఎన్నికల ప్రచారం చేస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఖాగెన్ ముర్ము మహిళను ముద్దుపెట్టుకున్న ఫోటోలు సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ చేయబడ్డాయి. దీంతో తో ఈ ఘటన పై పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో తీవ్ర దుమారం రేగుతోంది.