Prabhas Maruthi : ప్రభాస్ ఎల్‌ఈడీ కటౌట్‌ రెడీ అవుతోంది గురూ.. వీడియో వైరల్

-

రీసెంట్ గా సలార్ మూవీతో సూపర్ హిట్ ని అందుకున్న పాన్ ఇండియా హీరో ప్రభాస్ ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ చిత్రాలను లైన్‌లో పెట్టాడు. ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో కూడా ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సంక్రాంతికి ప్రభాస్ నయా అవతార్‌ను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సగర్వంగా లాంఛ్ చేస్తోంది. సంక్రాంతికి టైటిల్‌,ఫస్ట్ లుక్‌ లాంఛ్ చేస్తున్నామని ఇప్పటికే ట్వీట్ చేశారు. ఇటీవల సంక్రాంతి సంబరాలు మొదలైన నేపథ్యంలో రెబల్ అభిమానులు ఫస్ట్‌ లుక్‌ లాంఛ్ ఈవెంట్లో భారీ ఎల్‌ఈడీ డిజిటల్‌ కటౌట్‌ను రెడీ చేస్తున్నారు. భీమవరంలో జనవరి 15 ఉదయం 6:30 గంటలకు భారీ కటౌట్‌ను లాంఛ్ చేయనున్నారు. ఈ ఏర్పాట్లకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

హార్రర్‌ కామెడీ జోనర్‌ చిత్రంలో మలయాళ ముద్దుగుమ్మ మాళవికా మోహనన్‌ కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమాలో మరో భామ రిద్ది కుమార్‌ కీ ముఖ్య పాత్రలో నటిస్తోంది. ప్రభాస్‌ నుదుటన బొట్టు, లాంగ్‌ హెయిర్‌, గడ్డంతో మ్యాన్లీ లుక్‌లో కేరళ ముద్దుగుమ్మ రిద్దికుమార్‌తో క్లోజప్‌ యాంగిల్‌లో ఉన్న ఫోటో ఒకటి ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంకా టైటిల్‌ ఫిక్స్ కాని ఈ సినిమా నీ వివేక్ కూచిబొట్ల, టీజీ విశ్వప్రసాద్ సంయుక్తంగా నిర్మించనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news