యాదాద్రీశుడి ఒక రోజు ఆదాయం ఎంతంటే ..?

-

యాదాద్రి భువనగిరి : యాదగిరి గుట్ట శ్రీ లక్ష్మి నరసింహ స్వామి ఆలయానికి అధిక సంఖ్యలో భక్తులు రావడంతో ఆలయ పరిసర ప్రాంతాలు రద్ధిగా మారాయి. దర్శనానికి క్యూలైన్లో భక్తులు బారులు తీరారు. శ్రీ లక్ష్మి నరసింహ స్వామి దేవస్థానానికి ఆదివారం మొత్తం రూ. రూ: 45,52,569 ఆదాయం సమకూరిందని ఆలయ అధికారులు వెల్లడించారు. ప్రధాన బుకింగ్‌ ద్వారా రూ.1,50,250, సుప్రభాతం ద్వారా రూ.6,100,కైంకర్యముల ద్వారా రూ.2,100, పుష్కరిణీ ద్వారా రూ. 3,000 సమకూరిందని తెలిపారు.

బ్రేక్ దర్శనం ద్వారా రూ.3,84,900, వీఐపీ దర్శనం ద్వారా రూ.6,90,000,వ్రతాలు ద్వారా 1,05,600 ,యాదరుషి నిలయం ద్వారా రూ.1,40,154,సువర్ణ పుష్పార్చన ద్వారా రూ.1,51,264,ప్రసాద విక్రయం ద్వారా రూ.18,87,700, ప్రచారశాఖ ద్వారా రూ.77,670, పాతగుట్ట ద్వారా రూ.36,290,వాహన పూజలు ద్వారా రూ.31,600,కొండపైకి వాహన ప్రవేశం ద్వారా రూ.7,00,000, శివాలయం ద్వారా రూ.13,500, కల్యాణ కట్ట ద్వారా రూ.90,000, అన్నదానం ద్వారా రూ.82,441 ఆదాయం ఆలయానికి సమకూరిందన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news