మ్యూజియం నుంచి ప్రభాస్ మైనపు విగ్రహం తొలగింపు

-

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన బాహుబలి ఎంత పెద్ద సక్సెస్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ సినిమాలో బాహుబలి పాత్రకు సంబంధించిన మైనపు విగ్రహాన్ని మేడం టుస్సాడ్స్ మ్యూజియంలో ఉంచిన విషయం కూడా తెలిసిందే. ఈ వార్త అప్పట్లో సంచలనంగా మారింది. రీసెంట్గా మైసూర్ మ్యూజియంలో ప్రభాస్ మైనపు విగ్రహం చర్చనీయాంశం అయ్యింది. ఇంతకీ అసలు విషయం ఏంటంటే..

Baahubali Producer Issues Legal Threat Over Prabhas' Statue From The Film  Installed At The Mysore Wax Museum Without Consent - READ TWEET

బాహుబలి ఫేమ్ ప్రభాస్ మైనపు విగ్రహాన్ని మూడేళ్ల క్రితం మైనపు మ్యూజియంలో పెట్టారు. ఓ పర్యాటకుడు దాన్ని ఫోటో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఈ చిత్రాన్ని ప్రభాస్ నెట్‌వర్క్ మరియు X పేజీలో షేర్ చేశారు. అయితే ఈ మైనపు బొమ్మ బాహుబలి తరహాలో లేదని పలువురు అభిమానులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇది ప్రభాస్ లా కాదు. డేవిడ్ వార్నర్ పొలికలు ఉన్నాయని నెటిజన్లు మండిపడ్డారు. బాహుబలి సినిమాలో ప్రభాస్‌గా ఉన్నట్లుగా మైనపు బొమ్మలేదని పలువురు అంటున్నారు. సోషల్ మీడియాలో ఈ తరహా చర్చ జరగడాన్ని బాహుబలి చిత్ర నిర్మాత శోభు యార్లగడ్డ గమనించారు. మైనపు విగ్రహాన్ని చూసి విసిగిపోయారు.

 

మ్యూజియంలో ఉన్న మైనపు విగ్రహం నాణ్యంగా లేదని, ఆ బొమ్మ బాహుబలి పొలికలులేవని, బొమ్మ ప్రభాస్ లా కనిపించడం లేదు అంటూ ఆయన అసహనం వ్యక్తం చేశారని తెలిసింది. బాహుబలి నిర్మాత మైనపు విగ్రహంపై అభ్యంతరం చెప్పడమే కాకుండా మైనపు బొమ్మను మ్యూజియంకు ఫోన్ చేసి విగ్రహాన్ని తొలగించాలని కోరారు. ఈ విషయం తెలుసుకున్న ఆ సంస్థ సోమవారం ప్రభాస్ మైనపు బొమ్మ విగ్రహాన్ని తొలగించింది. బాహుబలి మైనపు బొమ్మ పెట్టడానికి మ్యూజియం నిర్వహకులు అనుమతి తీసుకోలేదని పైకి చెబుతున్నారు. బాహుబలి మైనపు బొమ్మ విగ్రహంపై అభ్యంతరాలు వ్యక్తం చేసినందున దానిని తొలగించామని మ్యూజిమ్ నిర్వహకులు అంటున్నారు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news