నిజాయతీ కలిగిన పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా ప్రభాస్ కనిపిస్తారు : సందీప్ రెడ్డి వంగా

-

ప్రభాస్ హీరోగా యానిమల్ డైరెక్టర్ సందీప్ వంగా ‘స్పిరిట్’ అనే చిత్రాన్ని తెరకెక్కించనున్న సంగతి తెలిసిందే.ఈ సినిమా అప్‌డేట్స్ కోసం ప్రభాస్‌ ఫ్యాన్స్ మాత్రమే కాకుండా సినీ ప్రియులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా ఓ బాలీవుడ్‌ సినిమా టీజర్‌ లాంఛ్‌ ఈవెంట్‌లో పాల్గొన్న సందీప్ రెడ్డి వంగా ‘స్పిరిట్‌’పై స్పందించారు.

అందరూ అనుకుంటున్నట్లు ఈ సినిమా హార్రర్ స్టోరీ కాదని అన్నారు. నిజాయతీ కలిగిన పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్గా ప్రభాస్ కనిపిస్తారని తెలిపారు. ప్రస్తుతం మూవీ ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయన్నారు. ఈ చిత్రం తర్వాత యానిమల్ పార్క్ ను రూపొందిస్తానని చెప్పారు. ప్రస్తుతానికి ఈ అప్‌డేట్‌ మాత్రమే ఇవ్వగలను’ అని తెలిపారు. పూర్తి యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రానున్న ఈ సినిమాలో ప్రభాస్‌ తొలిసారి ఖాకీ దుస్తులు ధరించి, లాఠీ ఝుళిపించనున్నారు. ఈ పోలీస్‌ డ్రామాకు హర్షవర్ధన్‌ రామేశ్వర్‌ సంగీతాన్ని అందించనున్నాడు. ఎనిమిది భాషల్లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు  రానుంది.

Read more RELATED
Recommended to you

Latest news