పల్నాడు లో కీలక నేత, నరసరావు పేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు మార్చి 2వ తేదీన టీడీపీ లో చేరుతున్నట్లు ప్రకటించారు. గురజాలలో జరిగే ‘రా కదలి రా’ సభలో తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు సమక్షంలో చేరుతున్నట్లు తెలిపారు. ఈ సందర్బంగా నరసరావుపేటలో మీడియాతో ఆయన మాట్లాడుతూ…. ప్రజా సంక్షేమం, పల్నాడు అభివృద్ధికే తన ప్రతి అడుగు ఉంటుందని అన్నారు.
గురజాల వేదికగా జరగబోయే ‘రా కదలి రా ‘ సభకి కార్యకర్తలు, నాయకులు, అభిమానులు పెద్ద ఎత్తున తరలి రావాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రజా సంక్షేమాన్ని, పల్నాడు అభివృద్ధికి కట్టుబడి మరలా నరసరావుపేట ఎంపీగా పోటీ చేస్తున్నట్లు వెల్లడించారు.ఈ 5 సంవత్సరాలలో సాధించుకున్న వాటిని పూర్తి చేయడమే కాకుండా రానున్న కాలంలో మరిన్ని పల్నాడులో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని, వాటికి కట్టుబడి సదా తోడుగా ఉండేలా ఆశీర్వదించాలని శ్రీ కృష్ణ దేవరాయలు పల్నాడు ప్రజనీకానికి విజ్ఞప్తి చేశారు.