యాంకర్ ప్రదీప్ కు కేటీఆర్ థ్యాంక్స్.. ఎందుకంటే.. ?

-

తెలంగాణ మంత్రి కేటీఆర్ గిఫ్ట్ స్మైల్ అనే పేరుతో సేవా కార్యక్రమాలు చేస్తూ వస్తున్నారు. తాజాగా యాంకర్ ప్రదీప్ మరియు ఆయన స్నేహితులు కలిసి గిఫ్ట్ ఎ స్మైల్ కు ఆర్థిక సహాయం చేశారు. ప్ర‌దీప్ స్నేహితులు ఎస్వి. వెంకట బాబు ఎస్వీ క్రియేష‌న్స్ అధినేత రూ.15 లక్షలు, మురళీకృష్ణ మరియు శ్రీనివాస్ త్రివేణి పైప్స్ అధినేత నాలుగు లక్షలు అందజేశారు. ఈ సందర్భంగా యాంకర్ ప్రదీప్ కు మరియు అతని స్నేహితులకు కేటీఆర్ కృతజ్ఞతలు తెలిపారు. వారితో క‌లిసి దిగిన ఫోటోను కేటీఆర్ సోష‌ల్ మీడియాలో షేర్ చేసి కృత‌గ్జ‌త‌లు చెప్పారు.

pradeep and his friends donates for gift a smile

ఇదిలా ఉంటే గిఫ్ట్ ఎ స్మైల్ పేరుతో కేటీఆర్ రెండేళ్లుగా సహాయ కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నారు. మొదట ఆయన పుట్టిన రోజు సందర్భంగా కేటీఆర్ గిఫ్ట్ ఎ స్మైల్ ను ప్రారంభించారు. ఆ స‌మ‌యంలో కొన్ని అంబులెన్స్ ను ప్రభుత్వాసుపత్రుల‌కు గిఫ్ట్ గా ఇచ్చారు. రీసెంట్ గా ఆయ‌న పుట్టిన రోజు సంధ‌ర్బంగా కేటీఆర్ మరియు అభిమానులు టిఆర్ఎస్ నేతలు కొన్ని స్కూటీల‌ను వికలాంగులకు గిఫ్ట్ గా అందజేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version