ఇటీవల కాలంలో ప్రతి ఒక్కరూ ఇన్సూరెన్స్ కి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారు. అయితే ఇన్సూరెన్స్ అనేది కేవలం ఇన్వెస్ట్మెంట్ మాత్రమే కాదు. దీని వలన సెక్యూరిటీ కూడా ఉంటుంది. మధ్య తరగతి కుటుంబాలు ఎక్కువగా ఇన్సూరెన్స్ తీసుకుంటూ ఉంటారు. కానీ పేదలకు ఇన్సూరెన్స్ ప్రీమియం చెల్లించడం కష్టంగా ఉంటుంది. అయితే ప్రీమియం కేవలం ఒక్క రూపాయి నెలకి అంటే ఎలా ఉంటుంది..? పేదలు కూడా ఖచ్చితంగా ఈ ప్రీమియంని చెల్లించగలుగుతారు. అయితే ఆ స్కీమే ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన.
పేదలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఈ స్కీమ్ ని తీసుకురావడం జరిగింది. ఈ స్కీమ్ లో రెండు లక్షల వరకు యాక్సిడెంట్ కవర్ అందుబాటులో ఉంటుంది. అయితే ప్రీమియం ని మొత్తం కూడా సంవత్సరంలో ఒకసారి చెల్లించాలి. అదికూడా నెలకి ఒక రూపాయి మాత్రమే. ఇది బ్యాంక్ అకౌంట్ నుంచి డైరెక్ట్ గా కట్ అయిపోతుంది.
ఎలా రిజిస్టర్ చేసుకోవాలి…?
ఇక ఎలా రిజిస్టర్ చేసుకోవాలి అనేది చూస్తే.. ఈ ప్రభుత్వ స్క్రీన్ ని రిజిస్టర్ చేసుకోవడం చాలా సులభం. మీరు సమీపంలో ఉండే బ్యాంకుకు వెళ్లి మీరు అప్లై చేసుకోవచ్చు లేదా మీరు ఇన్సూరెన్స్ ఏజెంట్ ని కన్సల్ట్ చేసి అయినా సరే సులభంగా అప్లై చేసుకోవడానికి వీలు అవుతుంది. ప్రతి నెలా రూపాయితో రెండు లక్షల కవర్ లభిస్తుంది. అంటే సంవత్సరానికి పన్నెండు రూపాయలు. బ్యాంక్ అకౌంట్ నుంచి ఈ ప్రీమియం డబ్బులు ఆటోమేటిక్ గా కట్ అయిపోతాయి. దీనితో జూన్ 1 నుండి మే 31 వరకు ఇన్సూరెన్స్ కవర్ మీకు లభిస్తుంది.
ఈ స్కీం లో వున్న వ్యక్తి మరణించినా లేదా పూర్తి వికలాంగులైతే ఇన్సూరెన్స్ కింద రెండు లక్షల రూపాయలు వస్తాయి. ఒకవేళ కనుక పాక్షికంగా వికలాంగులైతే లక్ష రూపాయలు వస్తాయి.
ఎవరికి ఈ స్కీం మంచిది..?
70 ఏళ్లు పైబడిన వాళ్ళకి ఇది లాభదాయకంగా ఉంటుంది. అయితే తప్పని సరిగా బ్యాంక్ అకౌంట్ ఉండాలి గమనించండి. అలాగే అకౌంట్లో బ్యాలెన్స్ కూడా ఉండాలని గుర్తుపెట్టుకోండి. ఒకవేళ కనుక బ్యాంక్ అకౌంట్ మూసివేస్తే అప్పుడు పాలసీ క్యాన్సిల్ అయిపోతుంది.