షాకింగ్ : ఆఫ్రికాలో మ‌రో భ‌యంక‌ర వైర‌స్.. !

-

ఆఫ్రికాలో మరో భయంకరమైన వైరస్ బయటపడింది. తాజాగా మార్ బుర్గ్ అనే వైరస్ ప్రబలడం తో కలకలం రేపుతోంది. గినియాలో ఈ వైరస్ మొదటి కేసు వచ్చిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. ఎబోలా జాతికి చెందినదే ఈ వైరస్ కేసు అని ప్రపంచ ఆరోగ్య సంస్థ దృవీక‌రించింది. ఈ ప్రాణాంతక వైరస్ తో కూడా చాలా ప్రమాదమని నిపుణులు చెబుతున్నారు. గబ్బిలాల నుండి ప్రజలకు వ్యాపించే ఈ వైరస్ కారణంగా జ్వరం తీవ్ర తలనొప్పితో పాటు రక్తస్రావం అవుతోందని వైద్యులు చెబుతున్నారు.

marburg virus cases in affrica
marburg virus cases in affrica

ఇప్పటికే ఈ వైరస్ పై పరిశోధనల‌కు ప్రపంచ ఆరోగ్య సంస్థ నిపుణుల బృందాన్ని పశ్చిమ ఆఫ్రికాకు పంపించినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ప్రపంచవ్యాప్తంగా గత ఏడాది కాలంగా కరోనా మహమ్మారి కారణంగా ప్ర‌జ‌లు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఎంతో మంది ప్రజలు కరోనా బారిన పడి మృతి చెందారు. ఇప్పటికీ కొన్ని దేశాల్లో డెల్టా వైర‌స్ కలకలం రేపుతోంది. క‌రోనా బారిన ప‌డి ప్ర‌జ‌లు ఆస్ప‌త్రుల్లో చేరుతున్నారు. ఇలాంటి సమయంలో ఆఫ్రికాలో మరో వైరస్ గుర్తించడం ఆందోళనకరం.

Read more RELATED
Recommended to you

Latest news