ఆర్ఆర్ఆర్ టీమ్ కు వెరైటీగా విషెస్ చెప్పిన ప్రకాష్ రాజ్..!!

-

లాస్ ఏంజెల్స్ లో గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ ఫంక్షన్ లో  బెస్ట్ ఒరిజినల్ స్కోర్ విభాగంలో ‘నాటు నాటు’ సాంగ్ కు గానూ ఆర్ ఆర్ ఆర్ మూవీ  గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ సాధించింన  సంగతి అందరికీ తెలిసిందే. దీనితో దేశం మొత్తం ఆర్ ఆర్ ఆర్ మూవీ మేనియా తో ఊగిపోయింది. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు అందరూ RRR టీం కు అభినందనలు తెలిపారు.

సాక్షాత్తు దేశ ప్రధాని మంత్రి మోదీ గారు కూడా ఆర్ ఆర్ ఆర్ మూవీ టీమ్ కు అభినందనలు తెలిపారు. ఇక రాజమౌళి టీమ్ కూడా అమెరికాలో కూడా తెగ ఎంజాయ్ చేస్తున్నారు. ఇక ఎప్పుడూ వివాదాల కామెంట్స్ చేస్తూ హల్చల్ చేసే విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ ఆర్ఆర్ఆర్ టీమ్‌ కి తనదైన శైలిలో కంగ్రాట్స్ ను తెలియజేశాడు.

ప్రకాష్ రాజ్ వెరైటీగా ఒక వీడియో పంచుకుంటూ అభినందనలు తెలిపారు. ఆయన షేర్‌ చేసిన వీడియో వైరల్‌ అవుతోంది. ఆ వీడియో లో అవార్డ్ సాధించిన నాటు నాటు పాటతో ఒక పాత హాలీవుడ్‌ నటులు డాన్స్ చేసిన విడియో క్లిప్‌  పంచుకున్నాడు. నాటు నాటు పాటకు తగ్గట్లుగా అందులో ఇద్దరు నటులు డాన్స్ చేశారు. పాటకు సింక్ అయ్యేలా ఈ వీడియోను షేర్ చేసిన ప్రకాష్ రాజ్ ను అందరూ కొనియాడుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news