కొండా సురేఖకు ప్రకాశ్ రాజ్ కౌంటర్.. హీరోయిన్లు అంటే అంత చిన్న చూపా..?

-

తెలంగాణలో రాజకీయాలు ఇప్పుడు సినీ ఇండస్ట్రీ వైపు మళ్లాయి. నిన్న-మొన్న బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు ఒకరిపై మరొకరి మధ్య మాటల యుద్ధం నడిచింది. తాజాగా కేటీఆర్, మంత్రి సురేఖ మధ్య ఇవాళ ఉదయం మాటల యుద్ధం కొనసాగింది. అందుకు కౌంటర్ గా కొండా సురేఖ కేటీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేయడంతో సినీ ఇండస్ట్రీలో సంచలనంగా మారింది.

ప్రధానంగా  నాగచైతన్య-సమంత విడాకులు తీసుకోవడానికి 100 శాతం కేటీఆరే కారణం అని తెలిపారు మంత్రి కొండా సురేఖ. N-కన్వెన్షన్ హాల్ ను కూల్చకుండా ఉండాలంటే సమంతను నా దగ్గరికి పంపాలని కేటీఆర్ అడిగాడు. ఇందుకు సమంతను కేటీఆర్ వద్దకు పంపించేందుకు నాగార్జున ఒత్తిడి చేశారని.. సమంత నేను వెళ్లనంటూ నిరాకరించింది. దీంతో తాము చెప్పింది వింటే విను..లేకపోతే వెళ్లిపోమని చెప్పడంతోనే  సమంతకు విడాకులు ఇచ్చారని మంత్రి కొండా సురేఖ ఆరోపించింది. కేటీఆర్ కారణంగానే హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ త్వరగా పెళ్లి చేసుకుందని.. మరో ఇద్దరూ హీరోయిన్లు కూడా త్వరగానే పెళ్లి చేసుకున్నారని తెలిపింది కొండా సురేఖ. సినీ నటుడు ప్రకాశ్ రాజ్ మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై ట్విట్టర్ వేదికగా స్పందించారు. ” ఏంటీ సిగ్గులేని రాజకీయాలు.. సినిమాల్లో నటించే ఆడవాళ్ళంటే చిన్న చూపా ? జస్ట్ ఆస్కింగ్ అంటూ పోస్ట్ చేశారు ప్రకాశ్ రాజ్. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ అవుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news